Begin typing your search above and press return to search.

శ్రుతి పెట్టిన బాధ గురించి వంశీ...

By:  Tupaki Desk   |   24 March 2016 7:24 AM GMT
శ్రుతి పెట్టిన బాధ గురించి వంశీ...
X
సినీ పరిశ్రమలో తలెత్తే అంతర్గత విభేదాలు, వివాదాలు దాదాపుగా అంతర్గతంగా సమసిపోతుంటాయి. వాటిని బయట పెట్టడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే సినీ పరిశ్రమ గోరంత జరిగితే.. బయటికి వచ్చేసరికి కొండంత అయిపోతుంది. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇలా జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ మధ్య ‘ఊపిరి’ సినిమా యూనిట్ సభ్యులకు.. శ్రుతి హాసన్‌ కు మధ్య జరిగిన వివాదం ఎంత రచ్చ అయిందో తెలిసిందే. ముందు ఈ సినిమాకు ఓకే చెప్పి.. ఆ తర్వాత టాటా చెప్పేసిన శ్రుతిపై కేసు పెట్టే వరకు వెళ్లింది వ్యవహారం. చివరికి ఈ వివాదం ఎలాగోలా పరిష్కారం అయ్యిందనుకోండి. ఐతే ఈ గొడవ గురించి శ్రుతి కానీ.. ‘ఊపిరి’ యూనిట్ సభ్యులు కానీ.. పెదవి విప్పింది లేదు.

ఐతే డైరెక్టర్ వంశీ పైడిపల్లి అసలు వివాదం ఏంటన్నది వెల్లడించాడు. ‘‘శ్రుతి హాసన్ తో పెద్ద గొడవేమీ జరగలేదు. అన్నీ సిద్ధం చేసుకుని రేపు షూటింగుకి రేపు వెళ్లబోతుండగా డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరదని తాపీగా చెప్పింది. ఆ ఇబ్బంది ఉంటే ముందే చెప్పాలి కదా. ఓ పెద్ద సినిమా షూటింగ్ అనేది చాలామందితో ముడిపడిన విషయం. అన్నీ తెలిసిన శ్రుతి ఇలా చేయడం మాకు బాధ కలిగించింది. సినిమా నుంచి తప్పుకొంది అనే బాధ కంటే మరీ రెండు రోజుల ముందు ‘నో’ చెప్పడం ఎక్కువ బాధ పెట్టింది. ఐతే అదృష్టవశాత్తూ వెంటనే తమన్నా డేట్లు దొరడకం.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. కాబట్టి నో రిగ్రెట్స్’’ అని చెప్పాడు వంశీ.