Begin typing your search above and press return to search.

ప్చ్!! రీమేక్ దర్శకుడికే బెస్ట్ డైరెక్టరా??

By:  Tupaki Desk   |   18 Jun 2017 9:18 AM GMT
ప్చ్!! రీమేక్ దర్శకుడికే బెస్ట్ డైరెక్టరా??
X
64వ ఫిలింఫేర్ అవార్డులు ఎవరిని వరించాయో తెలిసిపోయింది. దాదాపుగా అంచనాల ప్రకారమే అవార్డుల ప్రకటన జరిగింది. ఒక్క బెస్ట్ డైరెక్టర్ విభాగంలో మాత్రం ఫిలింఫేర్ జ్యూరీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి. ఈ విభాగంలో ఊపిరి చిత్రానికి గాను వంశీ పైడిపల్లికి ఉత్తమ దర్శకుడి అవార్డును ప్రకటించింది ఫిలింఫేర్. కాని ఇప్పుడు సినిమా లవర్స్ కు ఇది పెద్దగా రుచించట్లేదనే చెప్పాలి.

ఈ ఏడాది ఫిలింఫేర్ బెస్ట్ డైరెక్టర్ కోసం.. జనతా గ్యారేజ్ కు కొరటాల శివ.. క్షణం మూవీ రవికాంత్ పెరెపు.. నాన్నకు ప్రేమతో తీసిన సుకుమార్.. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్.. అఆ తెరకెక్కించిన త్రివిక్రమ్.. ఊపిరి చిత్రం తీసిన వంశీ పైడిపల్లి పోటీ పడ్డారు. ఈ నామినేషన్స్ ను చూసినవారందరికీ పోటీ బాగా టఫ్ గా ఉందనే అభిప్రాయం కలిగింది. భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలతో మెప్పించిన డైరెక్టర్లు కూడా పోటీలో ఉండడంతో.. టగ్ ఆఫ్ వార్ తప్పదని అనుకున్నారంతా. కాకపోతే 'క్షణం' మరియు 'పెళ్ళిచూపులు' డైరక్టర్లకు అవార్డులు దక్కితే బెటర్.. అది చాలామందిని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని అనుకున్నారు. లేదంటే కొరటాల శివ సోషల్ మెసేజ్ ఇచ్చాడు కాబట్టి.. అతనికి దక్కితే బాగుంటుందని అనుకున్నారు. కాని.. ఫ్రెంచ్ మూవీని తెలుగులో రీమేక్ చేసిన వంశీ పైడిపల్లికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ప్రకటించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

వంశీ పైడిపల్లి ప్రతిభను తక్కువగా అంచనా వేయడం కాదు కానీ.. ఒరిజినల్ ను దాదాపుగా యథాతథంగా తీసిన చిత్రం ఊపిరి. కానీ సొంత కథతో.. కొత్త స్టోరీతో.. ఆకట్టుకునే కథనాలను రంగరించి తీసిన స్ట్రెయిట్ ఫిలిమ్స్ ను కాదని.. రీమేక్ దర్శకుడికి పట్టం కట్టడం ద్వారా.. అసలు సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్లు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/