Begin typing your search above and press return to search.

లేటెస్ట్ టెక్నాలజీతో మీ హోమ్ కీ .. మీ రూమ్ కి 'ఆహా': వంశీ పైడిపల్లి

By:  Tupaki Desk   |   3 Nov 2021 4:15 AM GMT
లేటెస్ట్ టెక్నాలజీతో మీ హోమ్ కీ .. మీ రూమ్ కి ఆహా: వంశీ పైడిపల్లి
X
దర్శకుడిగా వంశీ పైడిపల్లి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రాలను అందించడం ఆయన ప్రత్యేకత. నిన్న రాత్రి జరిగిన 'ఆహా 2.0' ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. 'ఆహా' ద్వారా అల్లు అరవింద్ గారు .. రామేశ్వరరావు గారు .. రామ్ జూపల్లి గారు చేస్తున్న జర్నీ చాలా బాగుంది. 'ఆహ'లో నేను కూడా భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. 'ఆహా'ను లాంచ్ చేసినప్పుడు ఏంటిదీ? .. ఎందుకూ? ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో ఏం చేద్దామని? అనే సందేహాలు చాలామందికి వచ్చాయి. అలాంటి సందేహాలు రావడం కూడా సహజం.

నిజంగానే ఇది చాలా పెద్ద పోటీ ప్రపంచం. అయినా ఒక బలమైన సంకల్పంతో అరవింద్ గారు .. రామ్ గారు .. రామేశ్వరరావుగారు ముందుకు వెళ్లారు. 'ఆహా'ను స్టార్ట్ చేసిన కొంతకాలానికే గుడ్ అన్నారు. ఆ తరువాత 'ఆహా' బెటర్ అన్నారు. ఇది సినిమాలా ఏడాదికి ఒకటి కదా అంటూ రిలాక్స్ కావడానికి ఉండదు. ప్రతి వారం .. ప్రతి నెలా .. ప్రతి ఏడాది ఇక్కడ పోటీ పడవలసిందే. ఇప్పుడు ఏ సర్వేలో చూసినా 'ఆహా' నెంబర్ వన్ అనే చెబుతున్నాయి. ఇది అంత తేలికైన విషయమేం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరికీ మా టీమ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వచ్చే ఏడాదికి 'ఆహా' మరింత బెస్ట్ లెవెల్ కి వెళుతుంది .. ఇది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పడం లేదు. ఇక్కడి కంటెంట్ పై గల నమ్మకంతో చెబుతున్నాను. 'ఆహా' నుంచి మున్ముందు అతి పెద్ద ఎనౌన్స్ మెంట్లు రానున్నాయి .. అన్ని బౌండరీలు అధిగమిస్తూ ముందుకు వెళుతుంది. 4K .. డిజిటల్ .. డాల్బీ తో 'ఆహా' మీ మ్ కి .. మీ రూమ్ కి రానుంది. మీరు చూపించే నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి 'ఆహా' అహర్నిశలు శ్రమిస్తూనే ఉంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను కూడా తీసుకుంటూ .. వాటిని సవరించుకుంటూ 'ఆహా' ముందుకు వెళుతోంది.

'ఆహా'కి సంబంధించి ఈ వేదికపై నేను .. అరవింద్ గారు .. రామ్ గారు కనిప్పించవచ్చు. కానీ 'ఆహా' కోసం 150 మంది టీమ్ డే అండ్ నైట్ ఇక్కడ ఎంతో అంకితభావంతో కష్టపడుతూ ఉంటుంది. ఇది ఒక సింపుల్ గేమ్ కాదు .. ఇక్కడ ఎన్నో డిపార్టుమెంట్లు ఉంటాయి. అన్నింటినీ చక్కబెట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు నేను టీమ్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ రోజుల్లో రోజుకు ఒక్క రూపాయి పెడితే ఏం దొరుకుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అలాంటిది 365 రోజులకు .. 399 రూపాయలు పెడితే .. ప్రతి ఒక్క రూపాయికి .. 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.