Begin typing your search above and press return to search.
పైడిపల్లికి ఈ పాట్లేమిటి? ఆ హీరోతో అయినా!
By: Tupaki Desk | 28 July 2020 2:30 AM GMTమహేష్ 25వ చిత్రం `మహర్షి`కి దర్శకత్వం వహించాడు పైడిపల్లి. ఆ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడని పొగడ్తలు వినిపించాయి. ఇక ఆ మూవీ తర్వాత వెంటనే పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మాటిచ్చిన మహేష్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్న సంగతి తెలిసిందే.
పైడిపల్లి వినిపించిన కథ నచ్చక పరశురామ్ స్క్రిప్టుకి కమిటయ్యాడు. ఆ తర్వాత కథేంటో తెలిసిందే. వంశీ పైడి పల్లి పలువురు హీరోల్ని కలిసి కథలు వినిపించాడని ప్రచారమైంది. స్టార్ హీరో రామ్ చరణ్ కి కథ వినిపించాడని చెప్పుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. చరణ్ కాకుండా వంశీ పైడిపల్లి మరో హీరోకి కథను వివరించాడని తెలిసింది.
నేడు పైడిపల్లి ట్టినరోజు సందర్భంగా మహేష్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. కానీ పైడిపల్లితో మరో సినిమా గురించిన ప్రస్థావన లేదు. అటు చరణ్ నుంచి శుభాకాంక్షలు అందుకున్నా అక్కడి నుంచి సినిమాకి సంబంధించిన కమిట్ మెంట్ ఏదీ లేదు. ఈలోగానే మరో ప్రచారం వేడెక్కించేస్తోంది. నేచురల్ స్టార్ నానీకి పైడిపల్లి ఓ స్క్రిప్ట్ వినిపించాడు. అయితే ఇది ఫ్రెష్ గా కొత్తదా లేక మహేష్ కోసం తయారుచేసినదేనా? అన్నదానికి క్లారిటీ లేదు. మరోవైపు నాని వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. పైడిపల్లికి ఓకే చెబుతాడా లేక ఇది పుకార్ మాత్రమేనని తేలుతుందా చూడాలి.