Begin typing your search above and press return to search.
ఆ క్రెడిట్ ఊపిరిదే
By: Tupaki Desk | 20 Jun 2017 9:44 AM GMTకొన్ని సినిమాలు కలెక్షన్లు తెచ్చిపెట్టకపోయినా మేకర్లకు మంచి పేరు ప్రతిష్ఠలు గౌరవాన్ని తీసుకొస్తాయి. దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం ఊపిరి. నాగార్జున - కార్తి ప్రధాన పాత్రధారులుగా తీసిన ఈ చిత్రం కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో వసూళ్లు తెచ్చిపెట్టలేదు. కానీ నాగార్జున యాక్టింగ్ కు - వంశీ పైడిపల్లి దర్శకత్వానికి మంచి మార్కులే పడ్డాయి. వీల్ చైర్ కే పరిమితమైపోయిన మల్టీ మిలియనీర్ - అతడికి సహాయంగా ఉండేందుకు వచ్చిన ఓ సాధారణ యువకుడి మధ్య ఏర్పడిన అనుబంధం అన్న పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రెంచి సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్ అయినప్పటికీ ఎక్కడా ఆ ఫీల్ రాకుండా నేటివిటీ టచ్ ఉండేలా సినిమా తీసిన తీరు మంచి ప్రశంసలందుకుంది.
‘ఊపిరి’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లికి ఫిలిం ఫేర్ అవార్డు వరించింది. వంశీ ఈ అవార్డు అందుకోవడం మొదటిసారి. ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ పాసుల కోసం క్యూలో ఎదురుచూసిన తాను ఈ అవార్డు అందుకోవడం మరిచిపోలేని అనుభూతి అని వంశీ చెప్పాడు. ‘నా మనస్సుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది. ఫిలిం మేకర్ గా ఊపిరి సినిమా నా బాధ్యతను మరింత పెంచింది. అన్నివైపుల నుంచి నాకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజైన తర్వాత అందుకున్న కొన్ని కాల్స్ - మెసేజెస్ నన్ను ఎంతగానో కదిలించివేశాయి’ అంటూ వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చాడు.
‘జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన వారిలో కూడా సంతోషం కనిపించదు. సంతోషాన్ని ఎక్కడో వెతుక్కుంటూ ఉంటారు. అది మనలోనే దాగుందనే విషయాన్ని గుర్తించరు. ఊపిరి సినిమాతో నేను ఈ విషయం తెలుసుకోగలిగాను. జీవితాన్ని కొత్త కోణం నుంచి చూడగలిగాను’ అంటూ ఊపిరి సినిమా వ్యక్తిగతంగా తనలో తెచ్చిన మార్పును వివరించాడు వంశీ పైడిపల్లి. ప్రిన్స్ మహేష్ బాబుతో తన నెక్ట్స్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాడు వంశీ. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా తర్వాత ఇది ప్రారంభమయ్యే అవకాశముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/