Begin typing your search above and press return to search.

అమెరికాలో మహేష్‌ కోసం వెతుకుతున్నారు

By:  Tupaki Desk   |   13 Oct 2017 5:08 PM GMT
అమెరికాలో మహేష్‌ కోసం వెతుకుతున్నారు
X
భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలంటే ముందు నుంచే అన్ని ఏర్పాట్లను చేసుకోవాలి. ముఖ్యంగా లొకేషన్స్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా వరకు దర్శకులు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు కొన్ని నెలల ముందే లొకేషన్స్ కోసం దేశాలను చుట్టేసి వస్తారు. ముఖ్యంగా కోలీవుడ్ దర్శకుడు శంకర్ తన ప్రతి సినిమాకు లొకేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. శంకర్ తన సినిమాను మొదలు పెట్టె కొన్ని నెలల ముందే లొకేషన్స్ కోసం ప్రముఖ దేశాలను చుట్టేసి వస్తారు. ఇక మహేష్‌ మ్యాటర్ ఏంటో చూద్దాం పదండి.

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ 25వ సినిమా లొకేషన్స్ కోసం అమెరికా లోని న్యూయార్క్ వీధులను చుట్టేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ ప్రతి షాట్ చాలా రిచ్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే అమెరికాలో కొన్ని లొకేషన్స్ చూడటానికి తన ఫెవరెట్ సినిమాటోగ్రాఫర్ పీఎస్.వినోద్ తో అలాగే ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో వెళ్లాడు. రీసెంట్ గా న్యూయార్క్ లో దిగిన ఒక ఫొటోను వంశీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాడు.

మహేష్ ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అనే నేను సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అయిపోగానే వంశీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నాడు మహేష్. దిల్ రాజు- సి. అశ్విని దత్ ఆ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.