Begin typing your search above and press return to search.

#మహేష్25 డైరెక్టర్ కూడా ఫిక్స్

By:  Tupaki Desk   |   19 Dec 2016 4:46 AM GMT
#మహేష్25 డైరెక్టర్ కూడా ఫిక్స్
X
టాలీవుడ్లో కాస్త స్లోగా సినిమాలు చేసే హీరోల్లో మహేష్ బాబు పేరు ముందుంటుంది. ఒక మూవీ తర్వాత ఒకటిగా హాడావుడి లేకుండా తీరిగ్గా సినిమాలు చేయడం మహేష్ అలవాటు. ఎక్కువ సినిమాలు చేయాలనుందని అంటాడే తప్ప ఆచరణలో పెట్టడు. కానీ ఇప్పుడు మహేష్ కూడా స్పీడ్ పెంచాడు. ఒక మూవీ సెట్స్ మీదుండగానే మిగిలిన వాటిని కూడా లైన్లో పెట్టేస్తున్నాడు.

కొరటాల శివతో సినిమా చేస్తాడని మొన్న మొన్ననే అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ నడుస్తుండగానే.. ఇప్పుడు మహేష్ 25వ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. మహేష్ ప్రెస్టీజియస్ మూవీకి దర్శకత్వం వహించబోతున్నట్టు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన సోషల్ మీడియా పేజీలో అనౌన్స్ చేశాడు. మహేష్ 25 సినిమా పీవీపీ బ్యానర్ కి చేయాల్సినప్పటికీ.. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నుట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సీన్ లోకి వచ్చాడు. మరో పెద్ద నిర్మాత అశ్వనీదత్ తో సంయుక్తంగా మహేష్-25 ని నిర్మించనున్నారు.

ఏ జోనర్ మూవీ అయినా హ్యాండిల్ చేస్తాడని వంశీకి పేరుంది. ఎవడుతో పాటు బృందావనం.. ఊపిరి లాంటి హిట్స్ ఉన్నాయ్. పైగా దిల్ రాజు కూడా నిర్మాతగా ఉన్నాడు కాబట్టి మహేష్25 ఫిల్మ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావొచ్చంటున్నారు. ఇక మహేష్- ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో చేస్తోన్న సంభవామి(వర్కింగ్ టైటిల్) ఫిబ్రవరి నాటికి పూర్తైపోతుందంటున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. అది కూడా 2017 రిలీజే. కొరటాలతో మూవీ చేస్తూనే వంశీ పైడిపల్లితో డైరెక్షన్లోనూ యాక్ట్ చేయనున్నాడు.