Begin typing your search above and press return to search.
కులం మాట లేకుండానే కుమ్మేసిన వంగవీటి!
By: Tupaki Desk | 21 Dec 2016 11:44 AM GMTటాలీవుడ్ ఇప్పుడు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ వంగవీటి. 30 ఏళ్లకు పూర్వం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. ఆ కథను ఇప్పుడు సినిమా రూపంలో అందిస్తున్న వర్మ.. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ.. కులాల మధ్య గొడవల మాదిరిగా ఆ ట్రైలర్ ప్రొజెక్ట్ చేయడంతో అన్ని వర్గాలకు అంత చేరువ కాలేకపోయింది.
కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడేసరికి.. వర్మ మరో సూపర్బ్ ట్రైలర్ ఇచ్చాడు. దీని గురించి.. ఈ ట్రైలర్ లో ఇంటెన్సిటీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యం అంతే. అసలు కులం మాట ఎత్తకుండానే.. రెండు వర్గాల మధ్య నెలకొన్న వైరం.. రాజకీయంగా నెలకొన్న వైషమ్యాలను చూచాయగా చూపించాడు. ఇందుకోసం చూపించిన విజువల్స్ లో.. పార్టీ జెండాలను కూడా వాస్తవ జీవితంలో ఉన్న రాజకీయ పార్టీలను ఇండికేట్ చేసేలా చూపించడమే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం.
పైగా 'రంగాతో మనకు కుదరదు' లాంటి డైలాగ్ వింటే.. ఒరిజినల్ పేర్లనే వాడినట్లుగా కనిపిస్తోంది. మరి నిజంగా ఆ పాత్రకే ఆ పేరు ఉపయోగించాడో లేక వేరే పాత్రకు ఈ పేరు పెట్టి ప్రచారం చేశాడో చూడాలి. మొత్తానికి రక్తపాతానికి రాజకీయం జోడించిన ఈ ట్రైలర్ ప్రారంభంలో.. 'ధైర్యం ముందు పుట్టి రౌడీ తర్వాత పుడతాడు' అంటూ వర్మ ఇచ్చిన ఇంట్రడక్షన్ అయితే కేక.