Begin typing your search above and press return to search.

కాపు కాసే శక్తి.. 2న ట్రైలర్ వస్తోందట

By:  Tupaki Desk   |   1 Oct 2016 11:43 PM IST
కాపు కాసే శక్తి.. 2న ట్రైలర్ వస్తోందట
X
''నేను కాపు కాదు కాని.. కమ్మలలో లేని కాపుల్లో నేను కూడా ఒక భాగం. నాకు ముద్రగడ పద్మనాభం అంటే ఇష్టం. నాకు పవన్‌ కళ్యాణ్‌ ను హేట్ చేయడం అంటే ప్రేమ. అలాగే చిరంజీవిని ప్రేమించాలంటే ఇష్టం లేదు'' అంటూ ఏదో ఫిలసాఫికల్ ట్వీట్ ఒకటి వదిలే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దీని చదివిన మనకు.. వంగవీటి ప్రమోషన్ల కోసం పరాకాష్ట ట్వీట్టు.. అబ్బే ట్విట్టర్లో పరాకాష్టే ఈ రాము.. అంటూ ఏదన్నా చెప్పాలని అనిపిస్తోందా??

గత నాలుగు రోజులుగా ''వంగవీటి'' సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు వర్మ. ఈ ప్రమోషన్ల కోసం రకరకాల పాటలను.. థీమ్ సాంగులను.. ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా విజయవాడకు చెందిన పొలిటికల్ లీడర్ వంగవీటి రాధాకృష్ణ చుట్టూ తిరిగే కథ కాబట్టి.. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి.. అక్టోబర్ 2న ''వంగవీటి'' ట్రైలర్ విడుదల అనే విషయం చెప్పడానికి.. ఇలా ప్రముఖ కాపు సామాజిక వర్గపు సెలబ్రిటీల పేర్లు చెబుతూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నాడు వర్మ.

''ఇది వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి'' అంటూ ఈ లైన్లో కూడా చాలా ఇంటెలిజెంటుగా సామాజిక వర్గపు స్పృహను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. చూద్దాం అసలు ట్రైలర్లో ఏం చూపిస్తాడో ఏంటో!!