Begin typing your search above and press return to search.

వర్మ వంగవీటికి.. కోర్ట్ పంచ్ పడనుందా?

By:  Tupaki Desk   |   1 Dec 2016 2:07 AM GMT
వర్మ వంగవీటికి.. కోర్ట్ పంచ్ పడనుందా?
X
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సంచలనాల చుట్టూతానే సంచారం చేస్తూ ఉంటాడు. గతంలో బెజవాడ (మొదట టైటిల్ బెజవాడ రౌడీలు ) అంటూ తనే నిర్మాతగా సినిమా తీశాడు. ఓ స్టోరీకి వర్మ కమిట్ అయితే.. చూసే వరకూ తీస్తూ ఉంటా అనే టైపు వర్మ. ఇప్పుడు మళ్లీ టైటిల్ మార్చి.. ఈసారి డైరెక్టుగా వంగవీటి అనే పేరుతో సినిమా చేసేశాడు.

'మీరు ఆకు రౌడీలైతే.. నేను రౌడీలకే రౌడీ' టైపులో స్టేట్మెంట్లు.. యాక్షన్లతో ఎలాగోలా సినిమా కంప్లీట్ చేసి.. రిలీజ్ కి రెడీ అవుతున్న టైంలో అసలు పంచ్ పడింది. వంగవీటి మూవీని తన తండ్రి జీవిత చరిత్రను సినిమా తీస్తున్నారని.. ఇందులో వాస్తవాలను.. తన తండ్రి జీవితాన్ని పక్కదోవ పట్టించారంటూ వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ ఇప్పుడు కోర్టుకెక్కాడు. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు.. ఇటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు.. అటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 2న కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

డిసెంబర్ 3న ఆడియో ఫంక్షన్ చేయాలని వర్మ డిసైడ్ చేస్తే.. డిసెంబర్ 2న కోర్టులో ఉండాలంటూ తాఖీదులు జారీ అయ్యాయి. మరి హైకోర్టులో తన సినిమాను వర్మ ఎలా డిఫెండ్ చేసుకుంటాడో చూడాలి. ఇక్కడ తేడా వస్తే మాత్రం డిసెంబర్ 23 రిలీజ్ అనుమానమే అనే టాక్ మొదలైపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/