Begin typing your search above and press return to search.

వాణీ క‌పూర్ కిర్రాక్ క్లీవేజ్ షో!

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:30 PM GMT
వాణీ క‌పూర్ కిర్రాక్ క్లీవేజ్ షో!
X
బాలీవుడ్ దివా వాణీకపూర్ ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆల్ర్టా మోడ్ర‌న్ బ్యూటీగా అమ్మ‌డు వెలుగు జిలుగులు ఇంట్ర‌స్టింగ్. టెంప్టింగ్ ఫోజుల్లో ఇన్ స్టాని హీటెక్కించ‌డం ప‌రిపాటే. ఆన్ ది స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా వాణీ వేడి త‌ప్ప‌నిస‌రి. హాట్ ఫోటోలతో యువ‌త గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. తాజాగా మరో కొత్త ఫోటోతో వాణీ లో వేడిని బ‌య‌ట‌కు తీసింది. బ్లాక్ క‌ల‌ర్ సిజ్లింగ్ దుస్తుల్లో క్లీవేజ్ మంట‌లు రేపుతూ వాలు చూపుల వ‌గ‌లాడిలా అగ్గిరాజేస్తుంది.

టోన్డ్ బాడీ లుక్ లో ఎద అందాల ఆర‌బోత స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. ముఖానికి మ్యాక‌ప్..షైనీ హెయిర్..చెవి దిద్దులు ..చేతికి ఎంపిక చేసుకున్న మ్యాచింగ్ గాజులు..పెద‌వుల‌కు ప‌ల‌చ‌ని లిప్ స్టిక్ ప్ర‌తీది వాణీ అందాన్ని మ‌రింత ఎలివేట్ చేస్తుంది.

క్లీవేజ్ తో పాటు వాణీ చూపులు నేరుగా గుండెల్లో బాణాల్లా దిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు హాట్ త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు.

ఇక వాణీ కపూర్ కెరీర్ విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ ఇంకా న‌త్త న‌డ‌క‌నే సాగుతోంది. స‌రైన స‌క్సెస్ ప‌డి మూడేళ్లు అయిపోతుంది. 'వార్' త‌ర్వాత విజ‌యం చెంత చేర‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన 'బెల్ బాట‌మ్' దారుణ‌మైన ఫ‌లితాన్ని అందుకుంది. అటుపై రిలీజ్ అయిన 'చండీఘ‌ర్ క‌రే ఆశీకీ' న‌ష్టాల్నే తెచ్చింది. దీంతో వాణీ కెరీర్ నెమ్మ‌దించింది.

ప్ర‌స్తుతం 'షంషేరా'లో న‌టిస్తోంది. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కించారు. పిరియాడిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ర‌ణ‌బీర్ క‌పూర్..సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాపైనే వాణీ క‌పూర్ ఆశ‌ల‌న్నీ క‌నిపిస్తున్నాయి. హిట్ అందుకుని రేసులోకి వ‌స్తే కెరీర్ ఊపందుకునే ఛాన్స్ ఉంది. లేదంటే క‌ష్ట‌మేనన్న సంకేతాలు అందుతున్నాయి.

వాణీక‌పూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నేచురల్ స్టార్ నాని సరసన 'ఆహా కళ్యాణం' తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అటుపై బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి అక్కడ సక్సెస్ అయింది.