Begin typing your search above and press return to search.

వాణీ... జిల్ జిల్ జిలేబీ అందాలు

By:  Tupaki Desk   |   13 March 2020 10:30 PM GMT
వాణీ... జిల్ జిల్ జిలేబీ అందాలు
X
2019లో రిలీజైన `వార్` చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించ‌డం తో మ‌రోసారి వాణీ క‌పూర్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కుముందు `బ్యాండ్ బాజా బ‌రాత్` రీమేక్ `ఆహా క‌ల్యాణం`తో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైనా ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డం త‌న‌కు పెద్ద మైన‌స్ అయ్యింది. ఇక పోటీ నాయిక‌ల న‌డుమ వాణీ రేసులో పూర్తిగా వెన‌క‌బ‌డింద‌నే చెప్పాలి. సౌత్ లోనూ ఈ అమ్మ‌డు జీరో అయిపోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

అప్ప‌ట్లోనే వాణీ ఫ్యాష‌న్ షోల‌కు త‌ప్ప న‌ట‌న‌కు ప‌నికి రాద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా య‌శ్ రాజ్ ఫిలింస్ ప‌ట్టు ప‌ట్టి త‌న‌కు అండ‌గా నిలిచి మ‌రీ పెద్ద స్టార్ ని చేసేందుకు సాయ‌ప‌డుతోంది. వార్ త‌ర్వాత ఈ అమ్మ‌డు అన్నీ భారీ చిత్రాల్లోనే న‌టిస్తోంది. త‌న‌కు తొలి నుంచి అండ‌గా నిలిచిన‌ య‌శ్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న భారీ హిస్టారిక‌ల్ చిత్రం `సంషేరా`లోనూ నాయిక‌గా న‌టిస్తోంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో వాణీ అత్యంత ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

ఇక లేటెస్టుగా వాణీ క‌పూర్ ఫోటోషూట్ ఒక‌టి యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. చూడ‌టానికి కాస్త ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపిస్తున్నా.. వాణీ వ‌య్యారాల వ‌డ్డ‌న కుర్రాళ్ల‌పై మ‌త్తు చ‌ల్లుతోంది. పింక్ డిజైన‌ర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాల్ని ఓ రేంజులోనే ఆవిష్క‌రించింది అమ్మడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.