Begin typing your search above and press return to search.
వామ్మోవ్! 1000 కోట్ల ప్రాజెక్టుల్లో వాణీ కపూర్!!
By: Tupaki Desk | 29 July 2021 2:30 AM GMT`ఆహా కళ్యాణం` బ్యూటీ వాణీ కపూర్ హిందీ చిత్రసీమలో ఎదురే లేని హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ఈ సోగకాళ్ల సుందరి ఓ వెలుగు వెలుగుతోంది. యష్ రాజ్ బ్యానర్ లోనే వరుస పెట్టి సినిమాలకు సంతకాలు చేస్తున్న వాణీ.. ఇండస్ట్రీ బెస్ట్ హీరోల సరసన నటిస్తూ సత్తా చాటుతోంది.
వాణీ ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి అడుగుపెట్టబోతోంది. అది కూడా సలార్ లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్ `సలార్` చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ప్రభాస్ కి విలన్ గా ఓ ప్రముఖ నటుడిని లాక్ చేశారు. అతడు ఎవరు? అన్నది ప్రశాంత్ ఇంకా రివీల్ చేయలేదు. ఇక ఆ పాత్రకు కథలో చాలా ప్రాముఖ్యత కూడా ఉండబోతుంది. ఇందులో ప్రతి నాయకుడి పాత్రకు కుటుంబ నేపథ్యం...ఓ గొప్ప చరిత్ర కూడా ఉంటుందిట. అతని ప్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపించింది. అలాగే విలన్ వైఫ్ పాత్ర కూడా కథలో అంతే కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. కీలకమైన విలన్ వైఫ్ పాత్ర కోసం వార్ బ్యూటీ వాణీ కపూర్ ని ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం. వాణీ కపూర్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో కనిపించనుంది.
మొత్తానికి వాణీ కపూర్ సౌత్ కెరీర్ లో కీలక పాత్రలో అవకాశం అందుకుంది. ఈ ఛాన్స్ తో వాణీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీతో పాటు వాణీ కపూర్ హిందీలో నటించిన మూడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
వాణీ నటించిన షంషేరా గురించి ఆసక్తికర అప్ డేట్ తెలిసిందే. షంషేరాకు దర్శకత్వం వహించిన కరణ్ మల్హోత్రా.. ఇది ప్రేక్షకులకు విజువల్ వండర్ గా కనిపిస్తుందని అన్నారు. ప్రధాన తారాగణం రణబీర్ కపూర్.. సంజయ్ దత్ .. వాణి కపూర్ పెర్ఫామెన్స్ పైనా ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రణబీర్ .. వాణీ అద్భుతమైన నటనను కనబరిచారని ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టుకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని అతడు అన్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ తన ప్రత్యేక అవతారంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని హామీ ఇచ్చారు.
వాణీ కపూర్ ఇందులో ఎంతో అందంగా కనిపిస్తుంది. గొప్ప నటనతో ఆకట్టుకుంటుందని దర్శకుడు అన్నారు. సంజయ్ దత్ విషయానికొస్తే... థియేటర్లలో ఆడియెన్ ఆశ్చర్యానికి లోనవుతారు అని అన్నారు. పాన్-ఇండియన్ హిందీ చిత్రం అంటే 'షంషేరా' అని అంగీకరిస్తారని మల్హోత్రా అభిప్రాయపడ్డారు.
"నేను అత్యుత్తమ హిందీ సినిమాపై పెరిగాను. థియేటర్లలో ప్రతి ఒక్కరూ ఆస్వాదించగలిగే నిజమైన వండర్ అనిపించే హిందీ చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నాను. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే వినోదాన్ని మేము సాధించామని నాకు నమ్మకం ఉంది.. అని అన్నారు. ``కోవిడ్ -19 పరిస్థితి మన దేశంలో మంచిగా మారాలని మేము అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఆపై సాధ్యమైనంత గొప్ప మార్గంలో ' షంషెరా 'విడుదలను ప్లాన్ చేస్తాము`` అన్నారాయన. వాణీ బ్యాక్ టు బ్యాక్ నటిస్తున్న ఈ సినిమాల బడ్జెట్లు అసాధారణమైనవి. ఇప్పటికిప్పుడు 1000 కోట్లు పైగా వీటికి పెడుతున్నారు నిర్మాతలు. అలాంటి క్రేజీ ఆఫర్లు వేరొక భామకు దక్కడం అంత సులువేమీ కాదు.