Begin typing your search above and press return to search.
ఆ బయోపిక్ మధ్య నుంచి నిద్రపోయానన్న సీనియర్ నటి!
By: Tupaki Desk | 12 July 2019 9:30 AM GMTవెండితెరను ఏలేసిన ఆ తరం నటి సావిత్రి. ఆమె జీవితాన్ని బయోపిక్ గా మహానటి చిత్రంగా తీయటం.. అదెంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలోనూ.. విడుదల తర్వాత తరచూ వార్తల్లో నిలిచేది. ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అయితే.. సావిత్రి తర్వాత సినిమాల్లోకి వచ్చి.. సావిత్రి నట వారసురాలిగా పలువురు అభివర్ణించే సీనియర్ నటి వాణిశ్రీ.. ఊహించని రీతిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యాన్ని కలిగించటం ఖాయం.
సినిమాలకు దాదాపు 13 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. తన లైఫ్ జర్నీ మాత్రం సినిమా చుట్టూ తిరుగుతూనే ఉందన్న మాటను ఆమె చెబుతారు. నేటికి ఆమె అన్ని సినిమాల్ని చూస్తుంటానని చెబుతారు. అందరూ బాగా నటిస్తున్నారంటూ.. అనుష్క.. నయనతార.. సమంత.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సినిమాలో చాలా బాగా నటిస్తున్నారంటూ కితాబులు ఇచ్చారు.
మరి.. సావిత్రి బయోపిక్ మహానటి సినిమాను చూశారా? ఎలా అనిపించిందన్న ప్రశ్నకు ఊహించనిరీతిలో ఆమె సమాధానం వచ్చింది. ఆ సినిమాను చూశానని.. కానీ సగం నుంచి నిద్రపోయినట్లు చెప్పారు. ఎందుకలా అంటే.. సినిమా సగం నుంచి సావిత్రి జీవితం తనకు కనిపించలేదన్నారు. ఈ సినిమా సందర్భంగా మిమ్మల్ని సంప్రదించారా? అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు. మరి.. మీ బయోపిక్ అంటే.. తన బయోపిక్ సాధ్యమే కాదని.. ఎందుకంటే సినిమా కథంటే మలుపులు ఉండాలని.. తన జీవితంలో అలాంటి మలుపులు లేవని తేల్చేశారు. తాను వచ్చినప్పుడు ట్రెండ్ ఎలా ఉండేదో దానికి తగ్గట్లే డ్రెస్ వేసుకునే దానినని.. చీరలో అందంగా కనిపించాలని ప్రయత్నించినట్లు చెప్పారు. ఒళ్లు కనిపించేలా సినిమా చేయాల్సి వస్తే.. ఆ సినిమాకు నో చెప్పేదానిని చెప్పారు.
సినిమా స్వర్ణయుగం ప్రారంభమైనప్పుడు తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టినట్లుగా చెప్పిన సావిత్రి.. ఇప్పుడు సినిమా రంగం వేరే యుగంలో ఉందని కుండబద్ధలు కొట్టారు. అప్పుడు సినిమాలోకం అనేవాళ్లని.. ఇప్పుడు సినీ మాయాలోకం అనాలేమో? అంటూ ఉన్నది ఉన్నట్లుగా.. నిర్మోహమాటంగా మాట్లాడేశారు. ఏమైనా వాణిశ్రీ.. వాణిశ్రీనే కదా?