Begin typing your search above and press return to search.
బీజేపీపై హీరోయిన్ బ్యాడ్ కామెంట్స్ వైరల్
By: Tupaki Desk | 27 July 2020 6:00 AM GMTగత నెల రోజులుగా తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా హీరోయిన్.. బిగ్ బాస్ ఫేం వనిత విజయ్ కుమార్ తెగ ట్రెండ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇటీవల పాల్ ను ఈమె మూడవ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కాని భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటీ అంటూ ఈమెపై విమర్శలు మొదలయ్యాయి. సినీ ప్రముఖులు కూడా పాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మీరు పెళ్లి చేసుకుంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే పాల్ మొదటి భార్య అయిన ఎలిజాబెత్ తన భర్తను వనిత పెళ్లి చేసుకుంది అంటూ కోర్టును ఆశ్రయించింది.
చుట్టు సమస్యలతో సతమతం అవుతున్న వనిత కొన్ని రోజుల క్రితం ఒక టీవీ షో లో రెచ్చి పోయి హోస్ట్ ను నువ్వు ఏమైనా పతివ్రతవు అనుకుంటున్నావా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. నీ బండారం బయట పెడతానంటూ హెచ్చరించింది. ఆ తర్వాత మరో వివాదం ఇలా వరుస వివాదాలతో మీడియాలో ఉంటున్న వనిత గురించిన ఒక పాత వీడియోను నటుడు నంజి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె మరింత కష్టాల్లో చిక్కినట్లయ్యింది.
కొన్నాళ్ల క్రితం వనిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో కనీసం 10 మంది నాయకులు కూడా లేని బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని.. ఆ పార్టీలో తన తండ్రి విజయ్ కుమార్ కీలక నేతను అంటూ బిజీగా ఉన్నాడని బ్యాడ్ కామెంట్స్ చేసింది. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ గురించి వనిత చేసిన ఈ వ్యాఖ్యలు ఆమెపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఈ వీడియోను బయటకు రానివ్వలేదు. ఇప్పుడు బయటకు రావడంతో బీజేపీ నాయకులు ఆమెను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే చుట్టు సమస్యలతో సతమతం అవుతున్న వనిత దీంతో మరింతగా ఒత్తిడికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.