Begin typing your search above and press return to search.

వైరల్‌ పిక్‌.. ఇతడు నీ నాల్గవ భర్తనా?

By:  Tupaki Desk   |   25 July 2020 11:30 PM GMT
వైరల్‌ పిక్‌.. ఇతడు నీ నాల్గవ భర్తనా?
X
తమిళ నటి.. బిగ్‌ బాస్‌ ఫేం వనిత విజయ్‌ కుమార్‌ మూడవ పెళ్లి విషయం తమిళ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తీసింది. ఆమె మూడవ పెళ్లి చేసుకున్న పీటర్‌ పాల్‌ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఈమెను వివాహం చేసుకున్నాడు. దాంతో భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మూడవ పెళ్లి చేసుకున్నా పర్వాలేదు కాని పెళ్లి అయ్యి విడాకులు తీసుకోని వ్యక్తిని పెళ్లి చేసుకోవడంను తప్పుబడుతున్నారు.

ఈ సమయంలోనే ఈమె సోషల్‌ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. తన వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు ఇంతగా స్పందిస్తున్నారంటూ వారిపై అసభ్యకర పద్దతిలో వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలోనే వనిత ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఫొటో దిగింది. అందులో ఆ వ్యక్తి వనిత బుజాల మీద చేతులు వేశాడు. ఇక వనిత చేతిలో మందు గ్లాస్‌ ఉంది. దాంతో వనిత మరోసారి సోషల్‌ మీడియాలో టార్గెట్‌ అయ్యింది.

ఆ ఫొటోను షేర్‌ చేస్తూ నెటిజన్స్‌ ఇతడు నాల్గవ భర్తనా అంటూ ఆమెను అసభ్యకరంగా ట్రోల్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఆ ఫొటో గురించి వస్తున్న వ్యాఖ్యలపై వనిత స్పందించింది. అతడు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన పక్కన ఆయన భార్య కూడా ఉన్నారు. కాని ఆమె ఫొటోను క్రాప్‌ చేసి కొందరు దీని వరకే షేర్‌ చేసి నన్ను ట్రోల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫొటోలో తప్పేం లేదన్నట్లుగా వనిత విజయ్‌ కుమార్‌ పేర్కొంది. నన్ను కావాలని కొందరు ఇలా వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారంది.