Begin typing your search above and press return to search.
మూడో భర్తను తరిమేయడంపై స్పందించిన హీరోయిన్
By: Tupaki Desk | 21 Oct 2020 5:31 PM GMTకరోనా లాక్ డౌన్ వేళ ప్రముఖ నటి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వివాహ బంధాలు నిలబడక ఆ నటి మూడో పెళ్లి చేసుకుంది.
సీనియర్ నటులు మంజులు-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ రెండో పెళ్లి కూడా పెటాకులు కావడంతో మూడో పెళ్లి చేసుకుంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో ఆమె పీటర్ పాల్ ను గత జూన్ లో మూడో పెళ్లి చేసుకుంది.. పీటర్ తనను బాగా అర్థం చేసుకున్నాడని అప్పుడు చెప్పుకొచ్చింది. ఇక అతడితోనే జీవితం అంటూ ఓ పెద్ద స్టేట్ మెంటే ఇచ్చింది.
వివాహం చేసుకున్న వనిత-పీటర్ పాల్ జంటపై పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు.
అయితే ఇటీవలే ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. గోవా ట్రిప్ లో మద్యం తాగి పీటర్ కొట్టాడని టాక్. చెన్నైకి రాగానే వనిత కోపంతో పీటర్ ఇంటి నుంచి గెంటేసిందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి చర్చించుకుంటున్నారట..
అయితే ఈ వార్తలపై వనిత విజయ్ కుమార్ స్పందించారు. ‘ప్రేమలో విఫలం కావడం తనకు అలవాటైందని.. ధైర్యంగా ఉన్నానని.. ప్రేమను నమ్ముతూ మోసపోతున్నానని’ వనిత వాపోయింది. ఫేక్ వార్తలను నమ్మొద్దని .. తాను ఏ తప్పు చేయలేదని.. నా కలలు, జీవితం ఆశలు చెదిరిపోయే స్థితిలో ఉన్నాయని.. ఎంతో పాజిటివ్ గా ఉన్నా భయంగా ఉందని’ వనిత తన బాధను వ్యక్తం చేసింది. ఇక తాజాగా వనిత మరో వీడియోను విడుదల చేసింది.
నా పీటర్ మళ్లీ మద్యానికి బానిసయ్యాడని.. మద్యం వల్ల అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. చాలా డబ్బులు ఖర్చు చేశానని.. ఇంటికి వచ్చాక కూడా పీటర్ ఏమాత్రం మారలేదని వనిత తెలిపింది. మద్యం కోసం ఇండస్ట్రీలో అప్పులు చేశాడని.. చాలా మందిని అడిగాడని.. పరువు తీశాడని వనిత తెలిపింది. స్మోకింగ్, డ్రింకింగ్ మారలేదని.. రక్తవాంతులు కావడంతో ఆస్పత్రికి తరలించామని వనిత తెలిపింది. అయినా మద్యం అలవాటు మారలేదని.. ఇంట్లో పారిపోయాడని వనిత తెలిపింది. తాను వెళ్లగొట్టలేదని.. ప్రస్తుతం అతడు తన భార్య, తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడని వనిత తెలిపింది. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేసింది.