Begin typing your search above and press return to search.
నా గురించి బాధపడకుండా మీ జీవితాలను సరిదిద్దుకోండి
By: Tupaki Desk | 30 Oct 2020 11:30 PM GMTనటి వనిత విజయ్ కుమార్ గత కొన్ని నెలలుగా రెగ్యులర్ గా మీడియాలో ఉంటూ వస్తుంది. ప్రేమించిన వ్యక్తిని మూడవ పెళ్లి చేసుకున్న ఈమె అప్పటి నుండి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. భార్యతో విడాకులు తీసుకోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు వనిత విజయ్ కుమార్ ను చాలా మంది విమర్శించారు. ప్రముఖులు సైతం ఒక మహిళకు భర్త అయినప్పుడు నువ్వు అతడిని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆ సమయంలో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వనిత విజయ్ కుమార్ కొందరిపై కేసు కూడా పెట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక విషయంలో వనిత మీడియాలో ఉంటూనే ఉంది.
కొన్ని రోజులుగా ఈమె మూడవ పెళ్లి కూడా పెటాకులు అయ్యింది అంటూ తమిళ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ ఇవ్వకుండా వనిత విజయ్ కుమార్ మరోసారి మీడియాపై మరియు తన గురించి ప్రచారం చేస్తున్న వారిపై విరుచుకు పడింది. ట్విట్టర్ లో వరుసగా ట్వీట్స్ చేసి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని ఎండగట్టింది. నా గురించి బాధపడుతున్నట్లుగా నటిస్తున్న వారిని నేను ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. మొదట మీ జీవితాలను మీ కుటుంబాలను సరిదిద్దుకోండి. ఆ తర్వాత నా గురించి ఆలోచించవచ్చు.
నేను చాలా ధైర్యవంతురాలిని.. నా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను నేను సొంతంగా పరిష్కరించుకోగలను. నాకు చాలా మంది ప్రేమ దక్కతుంది. ఆ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉన్నాను. నాపై అభిమానం ప్రేమ కురిపిస్తున్న నెటిజన్స్ కు కృజ్ఞతలు అంది. నన్ను ఇష్టపడేవారికి నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. నా జీవితంలో ముఖ్యమైన అన్ని విషయాలను వారితో షేర్ చేసుకునేందుకు నేను సిద్దంగా ఉంటాను. ఎవరు కూడా నా విషయం పట్ల జాలీ దయ చూపించాల్సిన అవసరం లేదు అంటూ ట్విట్టర్ వేదికగా తనపై ట్రోల్స్ చేస్తున్న వారిని హెచ్చరించింది.