Begin typing your search above and press return to search.

న‌టీమ‌ణి ఫైర్ః అమ్మాయిగా పుడితే పెళ్లి చేసుకోవాల‌నే రూల్ ఉందా..?

By:  Tupaki Desk   |   10 March 2021 12:30 AM GMT
న‌టీమ‌ణి ఫైర్ః అమ్మాయిగా పుడితే పెళ్లి చేసుకోవాల‌నే రూల్ ఉందా..?
X
ఇప్పుడు తెలుగులో జోరుమీదున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. సొంత త‌మిళుల‌క‌న్నా.. తెలుగు ప్రేక్ష‌కులు ఈమెను బాగా ఓన్ చేసుకుంటున్నారు. దీంతో.. అవ‌కాశాలు వెల్లువ‌లా వ‌చ్చిప‌డుతున్నాయి. క్రాక్‌, నాంది చిత్రాల్లో వ‌ర‌ల‌క్ష్మి న‌ట‌న‌కు ఫుల్ మార్కులు ప‌డ్డాయి. దీంతో.. ఇప్పుడు బిజీ న‌టిగా మారిపోయింది.

అయితే.. ఇటీవ‌లే 36వ పుట్టిన రోజు వేడ‌క‌లు చేసుకున్నారు వ‌ర‌ల‌క్ష్మి. ఓ అనాథాశ్ర‌మంలో పిల్ల‌ల స‌మ‌క్షంలో బ‌ర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. పుట్టిన రోజును అనాథ పిల్ల‌ల మ‌ధ్య జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పింది వ‌ర‌ల‌క్ష్మి.

కాగా.. ఇదే స‌మ‌యంలో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నార‌ని ప్ర‌శ్నించారు పాత్రికేయులు. దీంతో.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ప్రతిసారీ ఈ పెళ్లి ప్ర‌స్తావ‌న ఎందుకు తెస్తార‌ని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. మ‌హిళగా పుడితే ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకోవాల‌న్న ష‌ర‌తు ఏమైనా ఉందా? అని గ‌ట్టిగా అడిగింది. ఇలాంటి ప్ర‌శ్న‌లు త‌ప్ప.. మ‌రో ప్ర‌శ్న దొర‌క‌దా? అంటూ ఫైర్ అయ్యింది వ‌ర‌ల‌క్ష్మీశ‌ర‌త్ కుమార్‌. ఆ విధంగా.. త‌న వ‌ద్ద పెళ్లి ప్ర‌స్తావ‌న మ‌రోసారి తీసుకురావొద్ద‌ని చెప్పేసింది.