Begin typing your search above and press return to search.
విశాల్ తో బ్రేకప్.. తూచ్ అంటోంది
By: Tupaki Desk | 29 Sep 2016 1:30 PM GMTసీనియర్ హీరో శరత్ కుమార్ కు వరలక్ష్మి అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఈమె కూడా హీరోయినే కానీ.. ఆ యాంగిల్ లో కంటే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కి లవర్ గా బాగా ఫేమస్ అయిపోయింది. ఈమెకు విశాల్ తో పెళ్లెప్పుడు అనేది కోలీవుడ్ లో చాలా రోజులుగా క్వశ్చన్ మార్క్. ఇందుకు కారణం శరత్ కుమార్- విశాల్ లకు ఏమాత్రం పొసగకపోవడమే. శరత్ కుమార్ ను ఓడించడానికే.. నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో విశాల్ పోటీ చేశాడని కూడా అంటారు.
అయితే.. ఈ వరలక్ష్మి రీసెంట్ గా ఓ ట్వీట్ పెట్టింది. 'బ్రేకప్ లు బాగా దిగజారిపోయాయి. ఏడేళ్ల అనుబంధాన్ని ఓ వ్యక్తి తన మేనేజర్ ద్వారా బ్రేక్ చేసుకున్నాడు. ఈ ప్రపంచం ఏమైపోతోందో.. ప్రేమ ఎక్కుడుందో?' అంటూ వరలక్ష్మి ట్వీట్ చేయడంతో.. కోలీవుడ్ అంతా రచ్చ రచ్చ అయిపోయింది. ఈమెకు విశాల్ తో ఏం గొడవొచ్చిందో.. పందెంకోడి ఎందుకు బ్రేకప్ చెప్పించాడో అని రకరకాల పుకార్లు అంచనాలు షికార్లు చేసేశాయి. జనాలంతా బుర్రలు బద్దలుకొట్టేసుకున్నాక.. అప్పుడు మరో ట్వీట్ పెట్టిందీ పిల్ల.
'నేను ఇంతకుముందు పెట్టిన ట్వీట్ పై చాలా రూమర్లు వస్తున్నాయి. నేను ప్రస్తుతం నా పనిని మాత్రమే ప్రేమిస్తున్నా. ఇది ట్వీట్ మాత్రమే. నా గురించి కాదు. కాబట్టి అందరూ సైలెంట్ గా ఉండండి' అంటోంది వరలక్ష్మి. ఈ మాట ముందే చెప్పి ఉంటే ఇంత హంగామా నడిచేది కాదుగా! ఇంత మంది పిచ్చోళ్లను చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నం మాత్రం ఇప్పుడు విమర్శల పాలవుతోంది.