Begin typing your search above and press return to search.

డబ్బివ్వకపోతే చెత్త రివ్యూలు రాస్తారు!

By:  Tupaki Desk   |   3 Sep 2018 11:01 AM GMT
డబ్బివ్వకపోతే చెత్త రివ్యూలు రాస్తారు!
X
వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరే. యాక్షన్ హీరో విశాల్ పెళ్లి వార్త వచ్చినప్పుడల్లా వరలక్ష్మి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ పెళ్లి వార్తలకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో గానీ వరలక్ష్మి మాత్రం తన పాటికి తాను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా వరలక్ష్మి సినిమా రివ్యూల గురించి ఘాటు కామెంట్స్ చేసింది.

వరలక్ష్మి తాజా చిత్రం 'ఎచ్చరికై - ఇదై మనిదరలగళ్ నడమాడుమ్ ఇదం' ఈమధ్యే రిలీజ్ అయింది. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ వరలక్ష్మికి మాత్రం కొంతమంది రివ్యూయర్ల తీరు నచ్చలేదు. ఆడియన్స్ రెస్పాన్స్ తో చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ నిజాయితీగా రివ్యూ లు రాసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. కానీ నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారిపై ఒక పంచ్ వేసింది డబ్బివ్వడానికి నిరాకరిస్తే నెగటివ్ రివ్యూ లు రాసే చెత్త ట్రెండ్ ఉందని తనకు ఈమధ్యే తెలిసిందని దీనివల్ల సినిమాలకు నష్టం జరుగుతోందని తెలిపింది. అసలు రివ్యూ లు చూసి ఒపీనియన్స్ ఎర్పరుచుకోవద్దని ప్రేక్షకులను కోరింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి అప్పుడు.. సినిమా సేవ్ అవుతుందని చెప్పింది.

కొంతమంది ఫిలిం మేకర్స్ చిన్న బడ్జెట్ సినిమాలను ఎంతో తపనతో.. ప్యాషన్ తో తెరకెక్కిస్తారని.. ఎంతో హార్డ్ వర్క్ చేస్తారని కాబట్టి ప్రేక్షకులు స్టార్లు లేరని ఆలోచించకుండా చిన్న సినిమాలను ఆదరించాలని - వాళ్ళకు ప్రేక్షకుల సపోర్ట్ చాలా అవసరం అని చెప్పింది. రివ్యూస్ ఎలా ఉన్నా తను మాత్రం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుందని హామీ ఇచ్చింది.