Begin typing your search above and press return to search.

వ‌ర‌ల‌క్ష్మి టాలీవుడ్ ని వ‌దిల్లేట్ లేదే!

By:  Tupaki Desk   |   20 Nov 2022 12:30 AM GMT
వ‌ర‌ల‌క్ష్మి టాలీవుడ్ ని వ‌దిల్లేట్ లేదే!
X
శ‌ర‌త్ కుమార్ వార‌సురాలిగా కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వ‌ర‌ల‌క్ష్మి న‌టిగా స‌క్సెస్ అయిన వైనం గురించి చెప్పాల్సిన ప నిలేదు. హీరోయిన్ అవ్వాల‌ని ఇండ‌స్ర్టీకి వ‌చ్చింది. కానీ ఆమెని ప‌రిశ్ర‌మ విల‌నీని చేసింది. హీరోయిన్ ని మించిన క్రేజ్ ని ద‌క్కించుకుంది. అదే పాపులారిటీతో తెలుగులోనూ అవ‌కాశాలు అందుకుంటుంది. సౌత్ లో ఇంకా ప‌లు భాష‌ల్లో అవ‌కాశాలు చేజిక్కించుకుంటుంది.

వ‌రల‌క్ష్మి హైట్..వెయిట్ కి త‌గ్గ వాయిస్ వంటివి ఆమెని అంత పెద్ద స్టార్ గా మార్చాయి. భ‌విష్య‌త్ లో మ‌రింత బిజీ న‌టి అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి..బాల‌కృష్ణ లాంటి హీరోల‌కు ధీటైన ప్ర‌తి నాయ ఇక పాత్ర‌కు ప‌క్కా యాప్ట్ అవుతుంద‌ని చెప్పొచ్చు. ఇక‌ అమ్మ‌డికి హిందీ అవ‌కాశాలు కూడా వ‌రిస్తున్నాయి.

ఇటీవ‌లే రిలీజ్ అయిన‌ 'య‌శోద' సినిమాలో ఓ కీల‌క పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని మ‌రోసారి మెప్పించింది. అమ్మ‌డి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఈసినిమా విష‌యంలో వ‌రం సైతం సంతోషంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. సినిమా రిలీజ్ కి ముందు..త‌ర్వాత కూడా చురుగ్గా ప్ర‌మోష‌న్ కార్య‌క‌ర‌మాల్లో పాల్గొంటుంది. ఇదే అదునుగా వ్య‌క్తి గ‌తంగానూ త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటుంది.

దొరికిన ఏ మీడియా సంస్థ‌ని విడిచిపెట్ట‌డం లేదు. దొరికిన వాళ్ల‌కి దొరికిన‌ట్లు ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తుంది. త‌న క్యాలిబ‌ర్ ని బ‌య‌ట పెడుతుంది. ఇది తెలివైన ప‌నే. స‌హాయ న‌టులు ఓ కొత్త ఇండ‌స్ర్టీకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు సెల్ఫ్ గా ముందుకెళ్ల‌డం త‌ప్ప‌నిస‌రిగా భావించాలి. ఎవ‌రూ ఎర్ర తివాచీ వేసి ఆహ్వానించ‌రు. అది కేవలం అగ్ర స్థాయి న‌టుల‌కే సాధ్య‌మ‌వుతుంది.

ఈ విష‌యంలో వ‌ర‌ల‌క్ష్మి బ్యాలెన్స్ గా వెళ్తుంది. ప్రేక్ష‌కులు స‌హా మీడియాని ఆక‌ట్టుకునే చ‌లాకీత‌నం అమ్మ‌డిలో పుష్ప‌లంగా ఉంది. ఇలాంటి చాకీ త‌నంతోనే ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్ కి పెన‌వేసుకుపోయింది. న‌టిగా క‌న్న‌త‌న‌లో ఈక్వాలిటీ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. తాజాగా వ‌ర‌లక్ష్మి స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది.

ఇలాంటి క‌లుపుగోలు త‌నంతో అవ‌కాశాలు అందిపుచ్చుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో బాల‌య్య హీరోగా న‌టిస్తోన్న 107వ సినిమాలో న‌టిస్తోంది. అలాగే 'హ‌నుమాన్'..'శ‌బ‌రి' చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఇంకా చిరంజీవి..నాగార్జున ..వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల‌కు విల‌నీగానూ సూట‌వుతుందని పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.