Begin typing your search above and press return to search.

ఇప్పుడేమంటావు వరలక్ష్మీ?

By:  Tupaki Desk   |   19 Oct 2015 3:29 PM GMT
ఇప్పుడేమంటావు వరలక్ష్మీ?
X
నడిగర్ సంఘం ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది విశాల్ వర్గం. నిజానికి ప్రెసిడెంట్ గా ఎన్నికైంది నాజర్ కాబట్టి.. నాజర్ వర్గం అనాలి. కానీ శరత్ కుమార్ ను ముందు నిలదీసింది విశాల్. అక్రమాల ఆరోపణలు చేసింది విశాల్. ఎలక్షన్స్ రావడానికి ప్రధాన కారణం విశాల్. అందుకే ఈ టీం విశాల్ వర్గం అయిపోయింది.

చివరిదాకా గట్టి పోటీ ఇచ్చినట్లు అనిపించినా శరత్ కుమార్ వర్గం ఘోరంగా పరాజయం పాలైంది. అసలు శరత్ కుమార్ ఇంతగా విశాల్ ను వ్యతిరేకించడానికి మరో కారణం కూడా ఉంది. అదే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. కొంతకాలంగా విశాల్ - వరలక్ష్మిలు రిలేషన్ లో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. విశాల్ గెలిస్తే.. తాను రెండు విషయాల్లో ఓడిపోయినట్లవుతుందనే శరత్ కుమార్ వ్యతిరేకించాడని అంటున్నారు.

విశాల్ పై భౌతిక దాడులు చేసి, కొట్టుకునే వరకూ వ్యవహారం వెళ్లినా.. ఎన్నికలకు ముందు వరలక్ష్మి మాత్రం "నా సపోర్ట్ మా నాన్నకే" అనేసింది. దీంతో విశాల్ కొంత ఇబ్బంది పడ్డా.. ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తన వర్గానికి సంబంధించిన అందరినీ గెలిపించుకున్నాడు కూడా. ఇప్పటికీ విశాల్ తో పెళ్లికి, శరత్ ఒప్పుకునే పరిస్తితి అయితే లేదు. మరిప్పుడు త్వరలో విశాల్ ఇంటికి వరలక్ష్మి రానుందనే అంచనాలున్నాయి. మరి వరలక్ష్మి ఇప్పుడేమంటుందో చూడాలి.