Begin typing your search above and press return to search.
రాధికను అమ్మ అనను.. ఆంటీ అంటాను
By: Tupaki Desk | 3 March 2020 7:30 PM GMTతమిళ నటుడు శరత్ కుమార్-నటి రాధిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శరత్ కుమార్ కు అంతకు ముందే పెళ్లి అయింది. ముందు భార్యకు శరత్ కుమార్ కు కుమార్తె వరలక్ష్మి. ప్రస్తుతం వరూ కోలీవుడ్ లో నటిస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే విలన్ గాను సత్తా చాటుతోంది. లేడీ విలన్ గా కోలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం ఎక్కువగా ఆ తరహా పాత్రలే వస్తున్నాయి. ఆ ఐడెంటిటీతోనే టాలీవుడ్ లోనూ బాగానే అవకాశాలు వస్తున్నాయట. అయితే కోలీవుడ్ లో బిజీ షెడ్యూల్స్ కారణంగా తెలుగు లో నటించలేకపోతోందట.
తాజాగా ఓ ఇంటర్వూ లో వరలక్ష్మి తన సవతి తల్లి రాధిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సవతి తల్లయినా...సొంత తల్లైనా బిడ్డ అమ్మ అనే పిలుస్తుంది. కానీ వరలక్ష్మి మాత్రం రాధికను ఆంటీ అని పిలుస్తుందట. మరి అమ్మ అని ఎందుకు పిలవరు అంటే? అమ్మ అనే పదం నన్ను కన్న నా తల్లికే సొంతం. ఇంకెవరినీ అలా పిలవలేను. నా వరకే కాదు..అందరి విషయంలోనూ అంతే.. అంటూ కాస్త రెబల్ లానే మాట్లాడింది. ``కన్న తల్లి వేరు.. సవతి తల్లి వేరు కదా. అందుకే రాధిక ని ఆంటీ అని పిలుస్తా. ఆ విషయంలో ఆంటీ కూడా పెద్దగా ఫీల్ కారు. నాన్న కూడా నచ్చిన విధంగానే ఉండమని చెబుతారు`` అని ముక్కు సూటిగా కుండ బద్ధలు కొట్టేసింది.
ఇలా ఉండాలి. అలా ఉండకూడదని ఎవరూ నాకు చెప్పరు. నా స్వేచ్చ నాకుంది. వాళ్లకిచ్చే గౌరవం వాళ్లకి ఇస్తాను. అయితే నా జీవితంలో నాన్న.. అంటీ ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు అని వరూ తెలిపింది. నాన్నకుఎంత ప్రాముఖ్యతనిస్తానో..రాధిక ఆంటీ కూడా నా దృష్టి లో అంతే సమానంగా చూస్తాను. ఎవరూ ఎక్కువ కాదు..తక్కువ కాదు అని తెలిపింది. అన్నట్టు తన స్నేహితుడు విశాల్ గురించి మాత్రం వరలక్ష్మి అస్సలు ఏమీ చెప్పనే లేదు ఏమిటో!