Begin typing your search above and press return to search.

హీరోయిన్స్‌ చెప్పేవన్ని పచ్చి అబద్దాలు

By:  Tupaki Desk   |   31 Oct 2018 9:30 AM GMT
హీరోయిన్స్‌ చెప్పేవన్ని పచ్చి అబద్దాలు
X
కోలీవుడ్‌ లో ఒకవైపు హీరోయిన్‌ గా కొనసాగుతూనే విలన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వరుసగా చిత్రాలు చేస్తున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్స్‌ ఎంతో మంది నేను దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను, ఎంతో మంది దర్శకులతో వర్క్‌ చేశాను. కాని ఎవరు కూడా నన్ను లైంగికంగా వేదించడం కాని - సెక్సువల్‌ ఫేవర్‌ చేయమని కాని అడగలేదు అంటూ ఉంటారు. చాలా మంది స్టార్‌ హీరోయిన్స్‌ ఇదే మాట అంటూ ఉంటారు. కాని వారి మాటలు పచ్చి అబద్దాలు. వారు చెబుతున్నది నిజం కాదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రస్తుత హీరోయిన్స్‌ అంతా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ను ఏదో ఒక సమయంలో ఎదుర్కొన్న వారే అంటూ వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది.

పాత తరం హీరోయిన్స్‌ కు ఈ అనుభవం లేదేమో కాని, ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ అంతా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ను ఎదుర్కోవడం, లైంగిక వేదింపులను ఎదుర్కోవడం ఖచ్చితంగా జరిగే ఉంటుంది. మీటూ ఉద్యమం వల్ల అన్ని సినిమా పరిశ్రమల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా కోలీవుడ్‌ లో అంతా కూడా చాలా సైలెంట్‌ గా ఉంటున్నారు. ఏ సమయంలో ఎవరి పేరు వస్తుందో అంటూ స్టార్స్‌ కూడా భయపడుతున్నారు. ఇండస్ట్రీలో అంతా కూడా భయపడుతున్నారని నేను భావిస్తున్నాను. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఈ జనరేషన్‌ తో పోతుందని తాను భావిస్తున్నాను అంటూ వరలక్ష్మి పేర్కొంది.

స్టార్‌ హీరోయిన్స్‌ ఎంతో మంది తాము లైంగిక వేదింపులు ఎదుర్కోలేదు అంటూ చేసిన వ్యాఖ్యలపై వరలక్ష్మి కౌంటర్‌ వేసింది. అయితే తాను మాత్రం శరత్‌ కుమార్‌ గారి కూతురును అవ్వడం వల్ల, బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండటం వల్ల ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ను ఎదుర్కోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే యంగ్‌ ఏజ్‌ లో మాత్రం లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ వయస్సులో నేను లైంగిక వేదింపులకు గురైనట్లుగా కూడా తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నన్ను అప్పుడు కొందరు లైంగికంగా వేదించారు అనిపిస్తుందని వరలక్ష్మి చెప్పుకొచ్చింది.