Begin typing your search above and press return to search.
నాగకన్యగా వరలక్ష్మి ప్రయోగం
By: Tupaki Desk | 8 Feb 2019 2:57 PM GMTవరలక్ష్మి శరత్ కుమార్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. కోలీవుడ్ లో దశాబ్ధ కాలంగా నటిగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే `పందెంకోడి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరుడుగట్టిన లేడీ ఫ్యాక్షనిస్టుగా వరలక్ష్మి డ్యాషింగ్ ఎంట్రీ అదిరిపోయింది. ఎలాంటి సినిమాతో టాలీవుడ్ బరిలో దిగాలని అనుకున్నానో అలాంటి సినిమా ఇంతకాలానికి తగిలింది! అంటూ వరలక్ష్మి తెలుగు మీడియా ముందు గర్వాంగానే చెప్పింది ఇంటర్వ్యూల్లో. ఫిజికల్ గానూ కాస్త రఫ్ గా.. రగ్గ్ డ్ గా కనిపించే వరలక్ష్మి ఆ తరహా పాత్రలకు యాప్ట్ అని ప్రశంసలు దక్కాయి. తను హీరో విశాల్ కి చిన్ననాటి స్నేహితురాలు. ఆ ఇద్దరి మధ్యా బాండింగ్ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతూనే ఉంటుంది. మేం ఇరువరం మంచి స్నేహితులం మాత్రమేనని ఆ ఇద్దరూ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇటీవలే విశాల్ హైదరాబాదీ అమ్మాయితో నిఖా ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.
`పందెంకోడి 2`లో వరలక్ష్మి నటనకు పేరొచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో విలన్ పాత్రల్లో ఛాన్స్ వస్తే నటించేందుకు వరలక్ష్మి సుముఖతను వ్యక్తం చేసింది. అయితే ఇప్పటివరకూ ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకి సంతకం చేసిందేం లేదు. ప్రస్తుతం ఈ భామ నటించిన తమిళ చిత్రం `నీయ` తెలుగులో `నాగకన్య` పేరుతో రిలీజవుతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి నాగ దేవతగా నటించింది. విజువల్ గ్రాఫిక్స్ బేస్డ్ లో చాలా కాలానికి నాగ దేవత కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. వరలక్ష్మితో పాటు ఈ చిత్రంలో లక్ష్మిరాయ్, కేథరిన్ వంటి అందగత్తెలు ఇతర కీలక పాత్రలు పోషించారు. జై ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సురేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ కి అద్భుత స్పందన వస్తోంది. నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఎలా ఉండబోతోంది అన్నది రిలీజ్ తర్వాతే తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లోనూ వేడి పెంచనున్నారట.
నాగకన్య కథాంశంతో సినిమాలు అనగానే టాలీవుడ్ లో చాలా కాలం క్రితం ప్రేమ ప్రధాన పాత్రలో `దేవి` అనే సినిమా వచ్చింది. ఇటీవలే రమ్యనంబీషన్ ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ `నాగభరణం` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. విష్ణు వర్ధన్ లాంటి సీనియర్ నటుడిని విజువల్ గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశారు. అలాగే బుల్లితెరపై నాగకన్య కథాంశంతో పలు టీవీ సీరియళ్లు అలరించాయి. హిందీ సీరియల్ నాగిన్ ఎంత ఫేమస్సో తెలిసిందే. ప్రస్తుతం నాగకన్యగా వరలక్ష్మి ప్రయోగం ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి.