Begin typing your search above and press return to search.
తెలుగులో దుమ్ములేపుతున్న అరవ భామ!
By: Tupaki Desk | 19 Jun 2021 11:30 PM GMTటాలీవుడ్ లో కావాల్సినంత మంది లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ.. డైనమిజాన్ని ప్రదర్శించే వారికి మాత్రం కొరత ఉంది. తొలి సినామాతోనే ఆ ప్లేస్ ను ఫిల్ చేసేందుకు వచ్చానని హింట్ ఇచ్చింది అరవ సుందరి వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురే ఈ వరలక్ష్మి.
సందీప్ కిషన్ హీరోగా నటించిన 'తెనాలి రామకృష్ణ' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో పవర్ ఫుల్ గా నటించిన వరలక్ష్మి.. తన సైడ్ నుంచి ఫుల్ సపోర్టు ఇచ్చింది. కానీ.. సినిమా ఆడకపోవడంతో ఈమె కెరీర్ కూడా పెద్దగా లేవలేదు.
కానీ.. ఆ తర్వాత వచ్చిన రవితేజ 'క్రాక్' సినిమాలో పోషించిన 'జయమ్మ' పాత్రతో అద్దరగొట్టిందనే చెప్పాలి. ఇది కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే. ఈ మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో.. వరలక్ష్మి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన అల్లరి నరేష్ మూవీ 'నాంది'లో క్యారెక్టర్ షేడ్ పూర్తిగా మార్చేసి, కష్టాల్లో ఉన్న హీరోను ఆదుకునే పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించింది.
ఈ సినిమాతో హీరో అల్లరి నరేష్ కు సమానంగా వరలక్ష్మికి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. సినిమాకే ఆయువు పట్టుగా ఉన్న ఆమె రోల్.. ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విధంగా.. నటించిన మూడు సినిమాల్లోనూ డైనమిక్ రోల్స్ ను ప్లే చేసిన వరలక్ష్మి.. చాన్నాళ్లకు ఇండస్ట్రీకి పవర్ ఫుల్ లేడీ వచ్చిందని చాటిచెప్పింది.
దీంతో.. ఇప్పుడు వరలక్ష్మికి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. త్వరలో బాలకృష్ణతో దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పవర్ ఫుల్ రోల్ ఆఫర్ చేశాడట దర్శకుడు. 'క్రాక్' వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమే కావడం విశేషం. దీంతో.. మరోసారి ఆమెను తీసుకుంటున్నాడు గోపీచంద్.
దీంతోపాటుగా.. జాంబిరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'హను..మాన్' సినిమాలోనూ గట్టిపాత్రనే చేయబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ పాత్రకన్నా బలంగా ఉండే క్యారెక్టర్ వరలక్ష్మిని వెతుక్కుంటూ వచ్చినట్టు సమాచారం. ఈ విధంగా.. తెలుగు ఇండస్ట్రీలో వరలక్ష్మి మోస్ట్ వాంటెడ్ పవర్ ఫుల్ లేడీగా మారిపోయిందని అంటున్నారు.