Begin typing your search above and press return to search.
నాన్న పేరు వాడుకుని బతకను!
By: Tupaki Desk | 30 Oct 2018 5:30 PM GMTడేరింగ్ అండ్ డ్యాషింగ్ గాళ్ వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారి పరిశ్రమలో వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో ఓ స్టార్ హీరో కుమార్తె ఇంత డేరింగ్ గా మాట్లాడడంతో అందరి మెప్పు పొందింది. ఆ సన్నివేశం గడిచి ఏడాది అయ్యింది. ఇప్పటికి మీటూ ఊపందుకుంది. ఇదే విషయంపై సర్కార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూకి వచ్చిన వరలక్ష్మిని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
వరలక్ష్మి మాట్లాడుతూ -``నేను ఏడాది క్రితం వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడాను. మీటూ ఎప్పటినుంచో ఉంది కానీ ఇండియాకి ఇప్పుడే వచ్చింది. మీటూ రావడం వల్ల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఓ భయం అనేది ఏర్పడింది. ఎప్పడు ఎవరి పేరు వినాల్సి వస్తుందో అని. దీనివల్ల భవిష్యత్ జనరేషన్ కి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇండస్ట్రీలో అలాంటిదేమీ లేదని చెబుతారు కానీ అది అబద్ధం. నేను ఆబద్ధాలు ఆడలేను. నాకు చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నిజం చెప్పడం నేర్పించారు. అలా అని ఇండస్ట్రీలో అందరూ చెడ్డవారని నేను చెప్పడంలేదు. నేను పనిచేసిన వారిలో కూడా చాలా మంది మంచి వారు ఉన్నారు. నాకు నా తండ్రి సపోర్ట్ ఉంది కాబట్టి భయం లేదనుకుంటే తప్పు. వేధింపుల సన్నివేశాలు నాకు కూడా ఎదురయ్యాయి. నన్ను ఫైర్ బ్రాండ్ అని ఎందుకంటారంటే నేను ఏదైనా కచ్చితంగా మాట్లాడతాను. తప్పంటే తప్పు.. లేదంటే లేదు. ఆఖరికి నాన్నగారితో కూడా తప్పంటే తప్పు అనే చెబుతాను. పిల్లలకు వేధింపుల గురించి తెలియజేయాలి. ముఖ్యంగా తల్లి అవగాహన తీసుకురావాల్సి ఉంటుంది`` అన్నారు.
మీకు నాన్నగారి అండ ఉంది కదా? అన్న ప్రశ్నకు.. ఆ పేరును అసలు ఉపయోగించనని అన్నారు వరలక్ష్మి. ప్రతి ఒక్కరికి ఒక టైమ్ అనేది వస్తుంది. లక్ అంటారు కదా.. అలా ఎన్ని సినిమాలు చేసినా లక్ కలిసి రావాలి అంతే. నేను ఎప్పుడూ ఎక్కడా నాన్న అన్న ట్యాగ్ వాడలేదు. మా నాన్నగారు గర్వించే మూమెంట్ నాకు ఇప్పటికి వచ్చింది. .. అని వరూ అన్నారు. నాన్న శరత్ కుమార్ తో కలిసి పాంబన్ అనే ఓ సినిమా చేస్తున్నా. అందులో నాది పోలీస్ ఆఫీసర్ రోల్.. అని వెల్లడించింది. సర్కార్ లో ఒక రాజకీయ నాయకురాలిగా నటిస్తున్నానని తెలిపారు.