Begin typing your search above and press return to search.
'సామ్ ఆరోగ్యం ఆ తర్వాతే క్షీణించి ఉండొచ్చు'.. హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 1 Nov 2022 3:30 AM GMTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని వెల్లడించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోన్న విషయం తెలిసి ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా సమంత అనారోగ్యంపై ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించింది. వీరిద్దరూ కలిసి నటించిన 'యశోద' సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో.. ప్రమోషన్స్ లో భాగంగా వరు లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామ్ తనకు పది పన్నెండేళ్ల క్రితమే తెలుసని.. చెన్నైలో ఇద్దరికీ పరిచయం అయ్యిందని.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది.
'యశోద' సినిమాలో సమంతతో కలిసి నటించడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని.. సెట్స్ లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లమని వరలక్ష్మీ పేర్కొంది. అయితే సామ్
అనారోగ్య సమస్యలతో బాధపడుతోందనే విషయం షూటింగ్ చేసేప్పుడు తమకు తెలియదని వెల్లడించింది. ఆమె ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండేదని సహ నటి చెప్పింది.
'యశోద' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని భావిస్తున్నానని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది. ఆమె ఒక ఫైటర్ అని.. త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నా అని తమిళ నటి చెప్పింది. సామ్ లీడ్ రోల్ లో నటిస్తే.. ఆమెకు సపోర్ట్ గా తన క్యారెక్టర్ ఎంటర్ అవుతుందని వెల్లడించింది.
సినిమాలో సామ్ క్యారెక్టర్ లో డెప్త్ తనకు బాగా నచ్చిందని.. యశోద పాత్ర కూడా వెరీ స్ట్రాంగ్ రోల్ అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పింది. దీని కోసం సమంత చాలా కష్టపడినట్లు తెలిపింది. ఆమె చాలా స్ట్రాంగ్ విమెన్.. యశోద పాత్రలో జీవించింది. పవర్ ఫుల్ రోల్ బాగా చేసిందని కొనియాడింది.
సామ్ కు చాలా సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేనేమో షూటింగ్ లో కొంచం గ్యాప్ దొరికితే జోక్స్ వేసేదాన్ని. తను నవ్వేసేది. 'షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావ్?' అంటుండేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది అని వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.
'క్రాక్' సినిమాలో జయమ్మగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోంది. గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' సినిమాలోనూ వరు కీలక పాత్ర పోషిస్తోంది.
ఇందులో బాలయ్య సోదరిగా వరలక్ష్మి కనిపించనుందని.. అది కథను మలుపుతిప్పే పాత్ర అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కొన్ని సీన్స్ కోసం 15 కిలోల బరువు తగ్గానని వరు స్వయంగా వెల్లడించింది. 'యశోద' సినిమా నవంబర్ 11న విడుదల అవుతుండగా.. 'వీర సింహారెడ్డి' చిత్రం 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.