Begin typing your search above and press return to search.
సామ్ తో సమాంతరంగా వరలక్ష్మి!
By: Tupaki Desk | 30 Oct 2022 11:30 AM GMTకోలీవుడ్ నటి వరలక్ష్మి గురించి పరిచయం అవసరం లేదు. స్ర్టెయిట్ తెలుగు సినిమాలు చేయకపోయినా అనువాద చిత్రాలతో ఇప్పటికే టాలీవుడ్ లో ఫేమస్ అయింది. లేడీ విలన్ పాత్రలకు పర్పెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. కటౌట్ కి తగ్గ వాయిస్ కూడా తోడవ్వడంతో వరం భవిష్యత్ లో పెద్ద స్టార్ అవుతుందని అంచనాలున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటుంది.
చిరంజీవి..బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు వరలక్ష్మి లాంటి లేడీ విలన్ తోడైతే? ఆ కాంబినేషన్స్ నెక్స్ట్ లెవల్ ఉంటాయని అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం వరలక్ష్మి ...సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `యశోద`లో నటిస్తోన్నసంగతి తెలిసిందే. నవంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోయూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టింది.
సమంత అరుదైన వ్యాధితో బాధపడటంతో సినిమా ప్రచారంలో పాల్గొనలేకపోతుంది. దాదాపు ఈసినిమా ప్రచారానికి సమంత హాజరయ్యే అవకాశం ఏమాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఆమె డాక్టర్లు పర్యవేక్షణ.. విశ్రాంతిలో ఉంది. ఈ నేపథ్యంలో యూనిట్ ఉన్న వాళ్లతోనే ప్రచారం చేస్తోంది. దీంతో వరలక్ష్మి తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి..అందులో పాత్ర గురించి చెప్పుకొచ్చింది.
ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇందులో నా పాత్ర సెకెండ్ లీడ్ రోల్ లా సాగుతుంది. సమంతతో పాటు సమాంతరంగా ఉంటుంది. మా పాత్రల మధ్య సంబంధం ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్ర కాస్త గ్రేషేడ్ లో కనిపిస్తుంది. ఇంత వరకూ ఇలాంటి రోల్ పోషంచలేదు. చాలెంజింగ్ గా అనిపించింది. దర్శకులు కథ వినిపించాక ఇలా ఎలా ఆలోచించగలిగారు అనిపించింది.
ఇలాంటి పాత్రలు ఎలా రాశారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసా. కథలో సరోగసి అనేది ఓ టాపిక్. దాని మంచి చెడులు గురించి సినిమాలో ఎక్కడా చర్చించలేదు గానీ.. నిజ జీవితంలో ఇలాంటి మనుషులు ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి మనుషులు డైలీ తారస పడుతూనే ఉన్నారు` అని చెప్పుకొచ్చింది.
వరలక్ష్మి వ్యాఖ్యల్ని బట్టి సినిమాలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా టచ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో అద్దె గర్భం హాట్ టాపిక్ గామారిన సంగతి తెలిసిందే. అందులోనూ సెలబ్రిటీ లైఫ్ లో సరోగసి చాలా సహజంగా మారిపోయింది. పిల్లల్ని కనడానికి అన్ని అర్హతులున్నా కొ తమంది అద్దెగర్భాన్ని ఎంచుకోవడంపై నెగివిటీ తారా స్థాయికి చేరుతోంది. మరి సినిమాలో ఇలాంటి అంశాలేవైనా టచ్ చేసారా? అన్నది చూడాలి. అదే జరిగితే యశోద సమాజాన్ని ప్రశ్నించినట్లుగానే భావించాలి.