Begin typing your search above and press return to search.
రిపోర్టర్ కి రిటార్ట్ ఇచ్చిన స్టార్ డాటర్
By: Tupaki Desk | 5 May 2019 4:50 AM GMTశరత్ కుమార్ వారసురాలిగా ఎంత పేరుందో విశాల్ మాజీ లవర్ గానూ అంత కంటే ఎక్కువ వెలుగులో కొన్నాళ్ళు మీడియాలో బాగా నానిన పేరు వరలక్ష్మి శరత్ కుమార్. మన తెలుగు వాళ్ళకు ఇంతకు ముందు పెద్దగా పరిచయం లేదు కానీ గత ఏడాది వచ్చిన పందెం కోడి 2-సర్కార్ లు తనకు మంచి గుర్తింపునే ఇచ్చాయి. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడటంలో పేరున్న వరలక్ష్మి ప్రెస్ తో సైతం ఇదే దూకుడును చూపిస్తూ ఉంటుంది .
చెన్నై లో ఇటీవలే అబుధాబిలో జరిగిన స్పెషల్ ఒలంపిక్స్ లో పాల్గొని బంగారు పథకాలు సాదించిన తమిళనాడు క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. దానికి వరలక్ష్మినే అతిధి. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఈ ఆటల్లో స్వర్ణం తెచ్చిన పేద అమ్మాయి గోమతి మారిముత్తుకు మీరేం సహాయం చేస్తారని ప్రశ్నించాడు
దానికి వరలక్ష్మి బదులిస్తూ హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ ఇప్పటికే తనకు చేసిన సహాయం తెలిసిందని అదే తరహాలో ఇంకొందరు స్పందించడం సంతోషంగా ఉందని బదులిచ్చింది. అంతటితో ఆగని ఆ రిపోర్టర్ అతను సరే మీరేం చేశారని రెట్టించి అడగటంతో వరలక్ష్మి తనదైన శైలిలో వెళ్లిపోయింది.
నా సంగతి సరే ఓ మీడియా ప్రతినిధిగా ఆ అమ్మాయికి మీరేం సహాయం చేశారని రివర్స్ లో అడిగింది. అతను ఏమి లేదు అని చెప్పేశాడు. చేయూత కేవలం సెలెబ్రిటీలకు పరిమితం కాదని అందరు బాధ్యత తీసుకున్నప్పుడే అలాంటివాళ్ళు వెలుగులోకి వస్తారని చురక వేసింది దీంతో సదరు రిపోర్టర్ బిక్క మొహం వేయడం తప్ప ఏమి చేయలేకపోయాడు