Begin typing your search above and press return to search.

నాన్నకు రివర్స్ గేర్ లో వర

By:  Tupaki Desk   |   17 Oct 2018 9:24 AM GMT
నాన్నకు రివర్స్ గేర్ లో వర
X
కొన్నేళ్ల క్రితం శరత్ కుమార్ కూతురి కన్నా హీరో విశాల్ లవర్ గానే మీడియాలో ఎక్కువ నానిన వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. ఒకరకంగా పందెం కోడి 2 టాలీవుడ్ లో తన మొదటి సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఎన్నో సినిమాల్లో ప్రాణ ప్రతిష్ఠ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ అవేవి తెలుగులో డబ్బింగ్ చేయకపోవడంతో మనకు చూసే అవకాశం దక్కలేదు. కానీ ఒక్క నెల గ్యాప్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో తెలుగులో రానుండటం పెద్ద ప్లస్ గా భావిస్తోంది. ఇక్కడ ఆఫర్లు దక్కించుకోవడానికి మంచి ప్లాట్ ఫార్మ్ గా ఫీలవుతోంది.

రేపు విడుదల కానున్న పందెం కోడి 2 లో వరది విశాల్ కు ధీటుగా ఉండే నెగటివ్ రోల్. వేర్వేరు ఊళ్లకు చెందిన బద్ధ శత్రువులుగా విశాల్ - వర మధ్య దర్శకుడు లింగుస్వామి ఓ రేంజ్ లో మాస్ మసాలా యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టాడట. ఇది తనకు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తుందనే నమ్మకంతోనే వర స్వంత డబ్బింగ్ కూడా చెప్పింది. ఇక విజయ్ సర్కార్ వచ్చే నెల దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు. ఇది తెలుగులో కూడా వస్తోంది. వరలక్ష్మి ఇందులో కూడా రాజకీయ నేపధ్యం ఉన్న కీలక పాత్ర పోషిస్తోంది. కథలో కీలక మలుపుకు కారణమయ్యే వరలక్ష్మి ఏరికోరి మరీ ఒప్పించాడట దర్శకుడు మురుగదాస్.

ఇక్కడ కాకతాళీయం ఏంటంటే రెండు సినిమాల్లోనూ హీరొయిన్ కీర్తి సురేషే. ఒకేసారి తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. వరలక్ష్మి నాన్న శరత్ కుమార్ కెరీర్ మొదట్లో తెలుగులో చేసి కోలీవుడ్ వెళ్తే వర మాత్రం అక్కడ ప్రూవ్ చేసుకున్నాక టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. అంటే నాన్నకు రివర్స్ గేర్ అన్నమాట. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పందెం కోడి 2 మీద తెలుగులో సైతం మంచి అంచనాలే ఉన్నాయి. అవి ఎంత వరకు నిలబడతాయి రేపు తేలిపోతుంది.