Begin typing your search above and press return to search.

రోషం ఉన్న పందెం కోడినిరా!!

By:  Tupaki Desk   |   10 Oct 2018 8:17 AM GMT
రోషం ఉన్న పందెం కోడినిరా!!
X
పొగ‌రు ఒగ‌రు ఉన్న పొందెంకోడి .. కాలికి క‌త్తిగ‌ట్టిన పందెంకోడిని చూపించేందుకు లింగుస్వామి & కో ప్రిప‌రేష‌న్‌ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ద‌స‌రా బ‌రిలో తెలుగు సినిమాల‌తో పోటీప‌డుతూ విశాల్ `పందెంకోడి 2` రిలీజ్‌ కి రెడీ అవుతోంది. మొన్న‌నే రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఇది ఆరంభం మాత్ర‌మే.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ అని విశాల్ స‌వాల్ విసిరాడు. ఈ సినిమాలో న‌న్ను మించిన పందెంకోడి మై డాళింగ్ వ‌రూ! అంటూ హింట్ కూడా ఇచ్చాడు. తెలుగు - త‌మిళ్‌లో ఒకేసారి `పందెంకోడి 2` (సంద‌కోజి 2) చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న నేప‌థ్యంలో ఉత్కంఠ పెరుగుతోంది.

ఈసారి పందెంకోడి 2 చిత్రాన్ని వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కోణంలో చూడాల‌ని ముందే చెప్పారు కాబ‌ట్టి, అందుకు త‌గ్గ‌ట్టే వ‌రూ ప్ర‌కంప‌నాల్ని ప్ర‌చారానికి బాగానే వాడేస్తోంది టీమ్‌. అస‌లు సిస‌లు పందెంకోడి ఈవిడే చూడండి! అంటూ సామాజిక మాధ్య‌మాల్లో కొత్త పోస్ట‌ర్ల‌ను తాజాగా రివీల్ చేశారు. ఈ పోస్ట‌ర్ల‌లో వ‌ర‌ల‌క్ష్మి ఎక్స్ ప్రెష‌న్స్ కెవ్వు కేక‌. మెల్ల‌క‌న్ను.. తిప్పుతూ వ‌రూ కొత్త ఎక్స్‌ ప్రెష‌న్ ఇచ్చింది. చీర‌క‌ట్టులోనే తాట ఒలిచింది. ప‌క్కా ర‌గ్గ్‌ డ్ రౌడీలా.. తెలంగాణ శ‌కుంత‌ల‌కు వార‌సురాలిలాగా క‌నిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే నీలాంబరి త‌ర్వాత ఈవిడేనా? అన్న సందేహాల్ని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ స్క్రీన్‌పై స‌రికొత్త విల‌నీ చూడ‌బోతున్నామన్న భ‌రోసాని ఇస్తోంది. ఇలాంటి డెబ్యూ కోస‌మే వేచి చూస్తున్నాన‌ని మొన్న‌ ద‌స‌పల్లా ప్రెస్‌మీట్‌లో చెప్పిన వ‌రూ అన్నంత ప‌నీ చేసేట్టుంది!

విశాల్ - కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి విల‌నీ హైలైట్‌ గా ఉండ‌నుంది. ఇక ఇది విశాల్ కెరీర్ ల్యాండ్ మార్క్ (25వ‌) మూవీ కాబ‌ట్టి అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. లింగుస్వామితో క‌లిసి విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 18న సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు రిలీజ‌వుతున్న‌ రామ్ `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` చిత్రానికి `పందెంకోడి- 2` ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇవ్వ‌నుంది.