Begin typing your search above and press return to search.
విశాల్ ను చంపేస్తానంది
By: Tupaki Desk | 18 Dec 2018 12:05 PM GMTతమిళ స్టార్ హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మిల ప్రేమ విషయమై చాలా ఏళ్లుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో వీరిద్దరి మద్య ప్రేమ చాలా దూరం వెళ్లిందని వార్తలు వచ్చాయి. కాని అప్పుడు వారిద్దరు పెద్దగా స్పందించలేదు. కాని ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరు కూడా బ్రేకప్ అయ్యారని - ఇద్దరు స్నేహపూర్వకంగానే విడిపోయారు అంటూ తమిళ వర్గాల్లో కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం ఇంకా వీరిద్దరు ప్రేమించుకుంటూనే ఉన్నారు, ఏదో ఒక రోజున తమ పెళ్లి విషయాన్ని వారిద్దరు చెబుతారు అంటూ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నో ఇంటర్వ్యూల్లో విశాల్ తో పెళ్లి గురించి * ప్రేమ గురించి వరలక్ష్మిని ఎంతో మంది అడిగారు. కాని ఆమె మాత్రం విశాల్ త్వరగా పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంది, అతడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ర్యాఫిడ్ ఫైర్ రౌండ్ లో రెండు ఆసక్తికర విషయాలకు అత్యంత ఆసక్తికర సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చింది.
హీరోల్లో ముద్దు పెట్టాలంటే ఎవరికి పెడతారు అంటూ ప్రశ్నించగా వెంటనే శింబుకు ముద్దు పెడతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఎవరినైనా చంపేసే అవకాశం వస్తే ఎవరికి చంపేస్తావు అంటూ ప్రశ్నించగా మరో మాట ఆలోచించకుండా విశాల్ ను అంటూ సమాధానం అంటూ చెప్పేసింది. ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటూ ప్రశ్నిస్తే వారిద్దరిని మాత్రం కాదు అంటూ సమాధానం ఇచ్చింది. మొత్తానికి వరలక్ష్మి సమాధానాలు సినీ వర్గాల వారిని మీడియా వారిని మరోసారి ఆలోచనలో పడేసింది. విశాల్ ను చంపేయాలని వరలక్ష్మి ఎందుకు అనుకుంటుంది అంటూ కొందరు రకరకాలుగా విశ్లేషిస్తూ ఆలోచిస్తున్నారు.