Begin typing your search above and press return to search.
సమంతతో జట్టు కడుతున్న వరలక్ష్మి
By: Tupaki Desk | 10 Dec 2021 2:30 AM GMTనాగచైతన్యతో విడాకుల తరువాత కొంత విశ్రాంతి తీసుకున్న సమంత మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఎప్పటి లాగే మళ్లీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టింది. గుణశేకర్ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం `శాకుంతలం` షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేసిన సమంత వెంటనే తన తదుపరి చిత్రానికి రెడీ అయిపోయంది. ప్రస్తుతం తమిళంలో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ రూపొందిస్తున్న `కాదువాకుల రెండు కాదల్` చిత్రంలో నటిస్తున్న సమంత తాజాగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ చిత్రాన్ని ఓకే చేసింది.
లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి `యశోద` అనే టైటిల్‌ని ఇప్పటికే ఫైనల్ చేశారు. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా అబ్బురపరిచే కథతో రూపొందనున్న ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ అంటూ ఏదీ వుండదని, సామ్ పాత్రే ఈ చిత్రానికి హీరో అని చెబుతున్నారు. ఇక ఇందులో కథాను సారం ఓ ముఖ్య పాత్ర వుందట. ఆ పాత్ర కోసం తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ని మేకర్స ్ తాజాగా ఎంపిక చేసినట్టు తెలిసింది.
సినిమాలో వరలక్ష్మీ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా వుంటుందని, ఈ మధ్య కాలంలో ఆమె చేయని సరికొత్త పాత్ర ఇదని చెబుతున్నారు. మాస్ రాజా రవితేజ నటించిన `క్రాక్` చిత్రంలో వరలక్ష్మీ జయమ్మగా నటించి శభాష్ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అల్లరి నరేష్ `నాంది`లోనూ అతన్ని కాపాడే లాయర్ ఆద్యగానే తనదైన నటనతో ఆకట్టుకోవడంతో తెలుగులో వరలక్ష్మికి మంచి డిమాండ్ ఏర్పడింది. అదే సమంత `యశోద`లో వరుకు కీలక పాత్రలో నటించే అవకాశాన్ని అందించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.