Begin typing your search above and press return to search.
హీరోయిన్ డ్రైవర్ పైరసీ చూస్తుంటే..
By: Tupaki Desk | 21 Aug 2017 8:17 AM GMTఇండస్ట్రీలో జనాలంతా పైరసీ గురించి గగ్గోలు పెడుతుంటారు. పైరసీ వల్ల సినిమా చచ్చిపోతోందని అంటారు. కానీ ఇలా బయట గగ్గోలు పెట్టే వాళ్లలోనే కొంతమంది ఇంగ్లిష్ సినిమాల్ని ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసి చూస్తుంటారు. టొరెంట్ డౌన్ లోడ్స్ తోనే సినిమాలపై అవగాహన పెంచుకుని.. ఇండస్ట్రీలో పేరు సంపాదించిన వాళ్లు చాలామందే ఉంటారు. ఇక తమిళ ఇండస్ట్రీ పరిస్థితి అయితే దారుణం.
అక్కడ లోకల్ సినిమాల పైరసీ వెర్షన్లు చూసేవాళ్లకూ కొదవ ఉండదు. తమిళ సినిమాల పైరసీ వెర్షన్లు ఏ వెబ్ సైట్లో దొరుకుతాయో అక్కడి వాళ్లకు బాగా తెలుసు. ఇండస్ట్రీ జనాలే పైరసీని ప్రోత్సహిస్తున్నారని.. వాళ్ల ఉదాసీనత వల్లే తమిళ సినిమా దయనీయమైన స్థితికి చేరుకుందని విశాల్ లాంటి వాళ్లు ఆరోపిస్తుంటారు. పైరసీ మీద అతను ముందు నుంచి సిన్సియర్ గా పోరాడుతున్న సంగతి తెలిసిందే. విశాల్ కు మద్దతుగా అతడి ప్రేయసి వరలక్ష్మి శరత్ కుమార్ ముందుకు రావడం విశేషం.
ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సీన్ ముగించుకుని కారవాన్లోకి వెళ్తే అక్కడ ఆమె డ్రైవర్ కోలీవుడ్ కొత్త సినిమా ‘వీఐపీ-2’ పైరసీ వెర్షన్ చూస్తూ కనిపించాడట. దీంతో ఆమె అతడిపై తీవ్ర ఆగ్రహానికి గురైందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది వరలక్ష్మి. ఇండస్ట్రీతో టచ్ ఉన్న వాళ్లే ఇలా చేస్తే.. ఇక పైరసీ నుంచి సినిమాల్ని ఎవరు కాపాడతారని ఆమె ప్రశ్నించింది. దయచేసి పైరసీని ప్రోత్సహించి.. ఇండస్ట్రీని నాశనం చేయొద్దని ఆమె విజ్నప్తి చేసింది.