Begin typing your search above and press return to search.

ఆమె కళ్లలోకి చూస్తూనే వాళ్లంతా ప్రాణాలు వదిలారట!

By:  Tupaki Desk   |   9 March 2021 11:30 PM GMT
ఆమె కళ్లలోకి చూస్తూనే వాళ్లంతా ప్రాణాలు వదిలారట!
X
తెలుగు తెరకి బాలనటిగా పరిచయమై, చెల్లెలి పాత్రలను అత్యధికంగా చేసిన నటిగా 'వరలక్ష్మీ' కనిపిస్తారు. వరలక్ష్మీ వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె నటనలో సహజత్వం అప్పట్లో ఆమెకి చాలామంది అభిమానులను సంపాదించి పెట్టింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత ఆమె సీరియల్స్ లో బిజీ అయ్యారు. అలా ఆమె బుల్లితెర ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వరలక్ష్మీ .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.

"నేను పుట్టింది 'భీమవరం'లో .. చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను మొదటిసారిగా పరిచయమైంది ఒక హిందీ సినిమాతో. ఆ తరువాత తెలుగులో బాలనటిగా చేసిన 'జీవన జ్యోతి' నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కొంత ఎదిగాక చెల్లెలి పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళ్లాను. కృష్ణగారు .. చిరంజీవిగారి సినిమాల్లో ఎక్కువగా నటించాను. ఇక శారద .. అన్నపూర్ణమ్మకి కూతురుగా ఎక్కువ పాత్రలు చేశాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ కావడంతో ఆర్ధిక పరమైన ఇబ్బందుల కారణంగా నేను కంటిన్యూగా నటించవలసి వచ్చింది.

నటిగా బిజీగా ఉండటం వలన పెద్దగా చదువుకోలేకపోయాను. కానీ అలా వచ్చిన డబ్బుతో నా సిస్టర్స్ ను చదివించాను. అదే నాకు ఇప్పటికీ సంతోషాన్నీ .. సంతృప్తిని ఇస్తూ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నేను పెద్దగా సంపాదించింది లేదు .. పోగొట్టుకున్నది కూడా లేదు. ఇక జీవితంలోని కొన్ని సంఘటనలు నన్ను ఎంతో బాధపెడుతూ ఉంటాయి. మా అమ్మగారు నా ఒళ్లో పడుకుని .. నా కళ్లలోకి చూస్తూ ప్రాణాలు వదిలారు. అలాగే మా నాన్నగారు కూడా నా కళ్లలోకి చూస్తూనే ప్రాణాలు విడిచారు. ఇక మామగారు కూడా అంతే .. అందుకే ఆ దృశ్యాలు కళ్లముందు మెదిలినప్పుడల్లా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుంది" అని చెప్పుకొచ్చారు.