Begin typing your search above and press return to search.

'వార‌సుడు' వివాదం..దిల్ రాజు వెర్ష‌న్ ఏంటీ?

By:  Tupaki Desk   |   24 Nov 2022 10:30 AM GMT
వార‌సుడు వివాదం..దిల్ రాజు వెర్ష‌న్ ఏంటీ?
X
ఇటీవ‌ల టాలీవుడ్ షూటింగ్ ల బంద్ సంద‌ర్భంగా దిల్ రాజు టాక్ ఆప్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన విష‌యం తెలిసిందే. షూటింగ్ ల బంద్ సంద‌ర్భంగా నిర్మాత‌లంతా త‌మ సినిమాల షూటింగ్ ల‌ని నిలిపివేస్తే దిల్ రాజు మాత్రం విజ‌య్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న 'వార‌సుడు' షూటింగ్ ని మాత్రం ఆప‌లేద‌ని, అదేమంటే అది త‌మిళ సినిమా అంటూ షూటింగ్ ని కంటిన్యూ చేయ‌డం తెలిసిందే. దీని కార‌ణంగా దిల్ రాజు ఆ స‌మ‌యంలో వార్త‌ల్లో నిలిచారు.

ఇక సినిమా రిలీజ్ ల విష‌యంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు గ‌త కొంత కాలంగా కార్న‌ర్ అవుతూ వ‌స్తున్నారు. తాజాగా 'వార‌సుడు' రిలీజ్, థియేట‌ర్ల కేటాయింపు విష‌యంలో మ‌రో సారి వార్త‌ల్లో నిలిచారు. నిఖిల్ న‌టించిన 'కార్తికేయ 2'ని తాను నాగ‌చైత‌న్య‌తో నిర్మించిన 'థాంక్యూ' రిలీజ్ కోసం కావాల‌నే వాయిదా వేయించ‌డనే వార్త‌లు వినిపించాయి. హీరో నిఖిల్ కూడా కావాల‌నే త‌న సినిమాని కొంత మంది వ‌రుస‌గా వాయిదా వేయిస్తున్నార‌ని వాపోవ‌డం తెలిసిందే.

నిఖిల్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అంద‌రి దృష్టి దిల్ రాజు వైపు మ‌ళ్లింది. త‌న వ‌ల్లే 'కార్తికేయ 2' రెండు ద‌ఫాలుగా వాయిదా ప‌డింద‌నే వార్త‌లు వినిపించాయి. దీనిపై దిల్ రాజు వివ‌ర‌ణ కూడా ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఇప్ప‌డు 'వార‌సుడు' చుట్టూ థియేట‌ర్ల వివాదం మొద‌లైంది. తెలుగు నిర్మాత‌ల మండ‌లి దిల్ రాజుకు వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న చేస్తే అల్లు అర‌వింద్‌, అశ్వ‌నీద‌త్ వంటి నిర్మాత‌లు దిల్ రాజుకు అండ‌గా నిలిచారు.

ఇంత జ‌రుగుతున్నా 'వార‌సుడు' వివాదంపై దిల్ రాజు నోరు విప్ప‌లేదు. సైలెంట్ గా గ‌మ‌నిస్తున్నారే కానీ ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అని వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. అయితే తాజాగా ఈ వివాదంపై స్పందిస్తానంటూ 'మ‌సూద‌' మూవీ స‌క్సెస్ మీట్ లో దిల్ రాజు స్ప‌ష్టం చేశారు. తాను ఈ వివాదంపై త్వ‌ర‌లోనే ప్రెస్ మీట్ పెట్ట‌బోతున్నాన‌ని, థియేట‌ర్ల వివాదంపై క్లారిటీ ఇస్తాన‌న్నారు. అంతే కాకుండా త‌న‌ని ప్ర‌తీ విష‌యంలోనూ అపార్థం చేసుకుంటున్నార‌ని, దిల్ రాజు సినిమాల‌ని తొక్కేస్తున్నాడ‌ని మాట్లాడుకుంటున్నార‌ని అయితే అందులో నిజం లేద‌న్నారు.

త‌న‌లో మ‌రో కోణం వుంద‌ని, న‌చ్చిన సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డం కోసం నా వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు. అద్భుత‌మైన సినిమాని చూపించాల‌న్న త‌ప‌న‌తో 'ల‌వ్ టుడే'ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాన‌న్నారు. అయితే ఈ మూవీ ద్వారా త‌న‌కు వ‌చ్చేది ఏమీ లేద‌ని, ఓ మంచి సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నుకుంటున్నాన‌న్నారు. ఇక 'వార‌సుడు' థియేట‌ర్ల ఇష్యూ వెన‌క ఏం జ‌రుగ‌తోందో స్ప‌ష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వివ‌రిస్తాన‌న్నారు. ఇంత‌కీ 'వార‌సుడు' వివాదంపై దిల్ రాజు ఏం చెప్ప‌బోతున్నాడు? .. ఆయ‌న వెర్ష‌న్ ఏంటీ? ఇంత‌కీ ఈ వివాదం వెన‌క ఎవ‌రున్నారు?  వారి ప్ర‌ధాన ఉద్దేశ్యం ఏంటీ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.