Begin typing your search above and press return to search.

వారసుడు.. దిల్ రాజుకి టెన్షన్ తప్పేలా లేదు?

By:  Tupaki Desk   |   26 Oct 2022 12:30 PM GMT
వారసుడు.. దిల్ రాజుకి టెన్షన్ తప్పేలా లేదు?
X
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదటిసారి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న వారసుడు సినిమాను ఒకేసారి తెలుగు తమిళంలో విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న విధానం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమల షూటింగ్స్ బంద్ చేయాలి అనే వాదన వినిపించినప్పుడు. ఇది తమిళ సినిమా అని గట్టిగానే ప్రచారాలు చేశారు.

అయితే మరొకవైపు హీరో విజయ్ తెలుగు తమిళనాడు తేడా లేకుండా వారసుడిని విడుదల చేయాలి అని అనుకుంటున్నాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలి అనే ఆలోచనతోనే స్ట్రైట్ తెలుగు ఫిలిం అనే విధంగా కూడా ప్రమోట్ చేయాలి అని అనుకున్నాడు. ఒక విధంగా దిల్ రాజుతో సినిమా చేయడానికి ప్రధాన కారణం తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకోవాలని ఆలోచనతో ఉండడమే.

ఎందుకంటే ఇప్పటికే చాలామంది తమిళ హీరోలు తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇక విజయ్ సినిమాలకు ఇటీవల కాలంలో తెలుగులో కూడా మంచి టాక్ ఏర్పడుతోంది. కాబట్టి అందుకే స్ట్రైట్ తెలుగు దర్శకుడితో అలాగే తెలుగు నిర్మాతతో వారసుడు సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఈ సినిమా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా తమిళ సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులే ప్రమోషన్స్ లో చెబుతూ ఉండడం విశేషం.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వారసుడికి ఎక్కువ ధియేటర్లో రావడం అంటే చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమాలకు థియేటర్లో అన్నీ కూడా పూర్తిస్థాయిలో దక్కిన తర్వాతనే డబ్బింగ్ సినిమాలకు కేటాయించడానికి ఒప్పుకుంటారు.

అయితే ఇప్పుడు వారసుడు పూర్తిస్థాయిలో తమిళం అని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తమిళ మీడియాలో ప్రచారాలు మొదలుపెట్టేశాడు. మరి సంక్రాంతికి ఒకేసారి మూడు లేదా నాలుగు తెలుగు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో వారసుడు సినిమాకు దిల్ రాజు ఎక్కువ ధియేటర్లు కేటాయిస్తే తప్పకుండా మరోసారి ఫోకస్ అవడం ఖాయం అని అనిపిస్తోంది. మరి ఆ టెన్షన్ నుంచి దిల్ రాజు ఏ విధంగా తప్పించుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.