Begin typing your search above and press return to search.
‘వారసుడు’ వాయిదా.. ఛాన్సే లేదు
By: Tupaki Desk | 7 Jan 2023 4:30 PM GMTసంక్రాంతి విడుదలయ్యే డబ్బింగ్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలా రోజుల నుంచి అయోమయం నడుస్తోంది. ఐతే రెండు రోజుల కిందటే ‘వారసుడు’, ‘తెగింపు’ చిత్రాల మేకర్స్ రిలీజ్ డేట్లు ప్రకటించేశారు. ఈ రెండు చిత్రాలూ ఈ నెల 11కే విడుదల ఖరారు చేసుకున్నాయి. కానీ ఉన్నట్లుండి ‘వారసుడు’ విషయంలో సందిగ్ధత నెలకొన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.
ఈ సినిమా 11న తమిళంలో మాత్రమే విడుదలవుతుందని.. తెలుగు వెర్షన్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని.. ఇది రెండు మూడు రోజులు ఆలస్యంగా రిలీజవుతుందని గుసగుసలు మొదలయ్యాయి. అదే జరిగితే ‘తెగింపు’తో పాటు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు అడ్వాంటేజ్ అని.. వాటికి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయనే చర్చ నడిచింది. ఐతే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాకు సాంకేతిక సమస్యలేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఎవరో తీసిన సినిమాను కొని డబ్ చేస్తున్నట్లయితే ఆలస్యం కావచ్చు కానీ.. తమిళంలో స్వయంగా తనే నిర్మించిన చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. గత నెలలో ‘లవ్ టుడే’ సినిమాను తక్కువ టైంలో మంచి క్వాలిటీతో డబ్ చేసి రిలీజ్ చేసిన దిల్ రాజుకు.. తన సొంత సినిమాను తెలుగులో రిలీజ్ చేసే విషయంలో సమస్యలు ఎందుకొస్తాయి.
నిజానికి దిల్ రాజు కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమాను తెలుగులో ఆలస్యంగా రిలీజ్ చేసే ప్రస్తావనే లేదు. తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుందట. నెల ముందరే థియేటర్ల మీద కర్చీఫ్ వేసి పెట్టి విడుదలకు అంతా సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ‘వారసుడు’ థియేటర్లను వేరే చిత్రాలకు వాటిని ఇచ్చే అవకాశమే లేదన్నది విశ్వసనీయ సమాచారం. తెలుగులో 11నే ‘వారసుడు’ విడుదలకు ధ్రువీకరిస్తూ కొత్తగా ప్రోమోలు కూడా రిలీజ్ చేయబోతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.