Begin typing your search above and press return to search.
వారసుడు నాన్ థియేట్రికల్ రైట్స్.. రాజుగారికి భలే గిరాకీ!
By: Tupaki Desk | 12 Sep 2022 3:31 PM GMTటాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దిల్ రాజు ఇటీవల కాలంలో మాత్రం కొన్ని వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. మీడియం రేంజ్ హీరోలతో అలాగే చిన్న హీరోలతో ఆయన పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. అలాగే కొత్త దర్శకులకు కూడా ఆయన ఎక్కువగా అవకాశం ఇవ్వడం లేదు. ఇక ఆయన ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్ వెళ్లిపోతున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఇక తనకు ఎంతో సన్నిహితంగా ఉండే వంశీ పైడిపల్లితో మరోసారి బిగ్ బడ్జెట్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు అనే ఆ సినిమా ఒకేసారి తమిళం తెలుగులో తెరపైకి రాబోతోంది. అయితే ఈ క్రమంలో ఆ సినిమా కోసం హీరో విజయ్ కు దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది.
అయితే దిల్ రాజు అంతగా ఎందుకు రిస్క్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ దిల్ రాజు ఎలాంటి సినిమా నిర్మించిన కూడా ముందుగానే బిజినెస్ వ్యవహారాల్లో చాలా తెలివిగా ఉంటాడు అని మరోసారి రుజువయింది. ఎందుకంటే వారసుడు సినిమా నాన్ థియేట్రికల్ గానే ఊహించని రేంజ్ లో బిజినెస్ చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ 50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.
అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో 60 కోట్లకు ఓటీటీ హక్కులను పొందింది. ఇక మ్యూజిక్ రైట్స్ టి సిరీస్ మరో 10 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ రూట్లో మొత్తంగా దిల్ రాజు కు 120 కోట్లు దక్కినట్లుగా తెలుస్తోంది.
అంటే దాదాపు విజయ్ రెమ్యునరేషన్ మొత్తం వెనక్కి రావడమే కాకుండా సినిమా బడ్జెట్లో కూడా కొంత వెనక్కి వచ్చినట్లే. మరి సినిమాను విడుదల చేసిన తర్వాత రాజుగారికి ఏ స్థాయిలో లాభాలు వస్తాయి చూడాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. వారసుడు సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.