Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కు విజయ్.. వారసుడు లెక్క పెరిగేనా?
By: Tupaki Desk | 21 Jan 2023 4:58 AM GMTతమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, దిల్ రాజు కాంబోలో వచ్చిన తాజా చిత్రం వారసుడు (తమిళంలో వారిసు). తనదైన నటన, స్టైల్ తో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులిద్దరినీ ఆకట్టుకున్నాడు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా తమిళంలో పరవాలేదు అనిపించింది. ఇక తెలుగులో కలెక్షన్స్ కోసం దిల్ రాజు టీమ్ ఎదో అలా ప్రమోషన్స్ ను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. మొదట్లో అయితే బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించగా.. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు అందుకుంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఇంకా అది సరిపోదు. ఇక హడావుడి చేయాలి కాబట్టి.. నిర్మాత దిల్ రాజు తన ఇంట్లోనే సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీ కోసం హీరో విజయ్ దళపతి చెన్నై నుంచి హైదరాబాద్ రాబోతున్నారు.
దిల్ రాజ్ ఇంట్లోనే పార్టీ ఉన్నందును నేరగా అక్కడికే వెళ్లనున్నారు. ఈ పార్టీలో వారసుడు టీంలోని ముఖ్యులు అందరూ రాబోతున్నట్లు సమాచారం. మరి క్రష్మిక కూడా ఈ పార్టీకి వచ్చి అల్లరి చేయనుందో లేదో తెలియాలంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే.
అలాగే ప్రెస్ మీట్ అంటూ తెలుగు ఆడియెన్స్ ను ముందు వారసుడు టీమ్ మరింత ఆకట్టుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వారసుడు.. శ్రీ వేకంటేశ్వ క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీశ్, పరమ్ పొట్లూరి, పెరల్ వి పొట్లూరిలు సంయుక్తంగా నిర్మించారు. విజువల్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ సినిమా.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. శరత్ కుమార్ విజయ్ కు తండ్రిగా.. అతని అన్నలుగా శ్రీకాంత్, కిక్ శ్యామ్ నటించాడు. ముగ్గురు అన్నదమ్ముల స్టోరీయే ఈ వారసుడు.
పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన వారసుడు హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ విజయ్ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని టైటిల్ కార్డులోనే క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదండోయ్ ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అన్ని బాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.