Begin typing your search above and press return to search.
ట్రిపుల్ ఆర్ స్ట్రీమింగ్ కోసం వెరైటీ ప్లాన్స్
By: Tupaki Desk | 4 May 2022 12:30 PM GMTయావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన 'ట్రిపుల్ ఆర్' ఎట్టకేలకు మార్చి 25న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాన్తంగా విడుదలై సంచలనాలు సృష్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఇది. ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల ఫిక్షనల్ స్టోరీగా 1920 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా భారీ వసూళ్లని రాబట్టి అప్పటి వరకు వున్న రికార్డుల్ని కొంత వరకు తిరగరాసింది.
హిందీ బెల్ట్ లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఇప్పటికే రూ.1100 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. యష్ హీరోగా నటించిన 'కేజీఎఫ్ 2' రిలీజ్ తరువాత 'ట్రిపుల్ ఆర్' ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ఆల్ మోస్ట్ ఎండింగ్ కి చేరింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని జీ5, నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్నాయి.
ఈ నెల నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రియులకు జీ5, నెట్ ఫ్లిక్స్ తాజా షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరగబోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటీటీ మెంబర్లకు ఒక్కసారి పే చేస్తే ఏ సినిమా అయినా చూసుకునే వీలుంటుంది. అయితే 'ట్రిపుల్ ఆర్' విషయంలో మాత్రం అలా కాకుండా ఎప్పుడు స్ట్రీమింగ్ చేసినా పే చేసేలా పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది.
దీంతో జీ5 ఓటీటీ వీక్షకులు షాక్ కు గురవుతున్నారట. తాజా పద్దతి కొత్తగా వుండటంతో వీక్షకలు, అబభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ అంటే సినిమా రిలీజ్ కు ముందు ఏర్పాటు చేస్తుంటారు కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో ఇలా సినిమా రిలీజై దాదాపు రెండు నెలలు కావస్తుంటే ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ ఏంటని అంతా తెల్లముఖం వేస్తున్నారు.
సినిమా స్ట్రీమింగ్ కి ముందే ఐ ట్యూన్స్ ని కూడా జీ5 విడుదల చేస్తోంది. ఇక సాధారణ ఓటీటీ ప్రేక్షకుల కోసం మాత్రం ఈ మూవీని జూన్ 3 నుంచి జీ5, నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే ఓటీటీ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా అధిక స్థాయిలో సినిమా పైరసీకి గురయ్యే అవకాశాలే ఎక్కువగటా కనిపిస్తున్నాయని, ఇలాంటి బ్లండర్ మిస్టేక్ ని జీ5 ఎందుకు తలపెట్టిందని వీవర్స్ కామెంట్ చేస్తుండటం విశేషం.