Begin typing your search above and press return to search.

ఆ భజన బాలయ్యే తట్టుకోలేకపోయారు

By:  Tupaki Desk   |   26 Dec 2017 1:13 PM GMT
ఆ భజన బాలయ్యే తట్టుకోలేకపోయారు
X
''ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ శ్రీరామరాజ్యం''.. ''అన్నం అంతా ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూచి చెప్పినట్లు.. జైసింహ ఎంతటి బ్లాక్ బస్టర్ అవుతుందో ట్రైలర్ చూసి చెప్పొచ్చు''.. ''అరాచక శక్తుల పట్ల రౌడీ ఇన్సపెక్టర్''.. ''ఫ్యాక్షనిజాన్ని ఇనుప పాదంతో తొక్కాలనే సమరసింహారెడ్డి ఈ మనిషి''.. ఆ రకంగా స్టేజీ మీద నందమూరి బాలకృష్ణను పొగుడుతుంటే ఆయనకు ఎలా ఉంటుంది? ''సింహా సార్ మీరు'' అంటూ విజయవాడ తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య 'జై సింహా' ఆడియో రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతుంటే.. ఆయన ఎలా ఫీలయ్యారు? ఇప్పుడు నెటిజన్లకు ఇవే సందేహాలు వస్తున్నాయి.

నిజానికి ఇటువంటి టూ మచ్ పొగడ్తలు ఏ హీరోకు కూడా అస్సలు నచ్చవు. ఇలాంటి డైలాగులు వాయిస్ ఓవర్ తరహాలో ఏదన్నా ఆడియో-వీడియో క్లిప్పింగ్ లో పెడితే పర్లేదు కాని.. స్వయంగా ఎదురుగా ఇటువంటివి వినిపిస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొన్న విజయవాడలో వర్ల రామయ్య అలా పరుచూరి బ్రదర్స్ రేంజ్ డైలాగులు చెబుతుంటే.. ఆ భజన తట్టుకోలేక బాలయ్య సైతం చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ముఖ కవళికల్లో అది స్ఫుటంగా కనిపించింది. ఇక పక్కనే ఉన్న అంబికా కృష్ణ ముబావంగా చప్పట్లు కొడుతుంటే.. స్టేజ్ క్రింద ఉన్న నారా లోకేష్‌ కూడా షాకైపోయి చూశారు. మరి ఈ రేంజులో భజన ఏంటి బాబోయ్ అన్నట్లు అక్కడ చాలామంది ఫీలింగ్.. అని వారి ఎక్స్ ప్రెషన్లు చెప్పకనే చెబుతున్నాయి.

నిజానికి సినిమా ఫంక్షన్లలో ఏం మాట్లాడాలో రాజకీయ నాయకులకు ఏం తెలుస్తుంది? అందుకే వారు కాస్త గొంతును సవరించుకుని భారీ డైలాగులు చెప్పేస్తుంటారు. అవి వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఈ యుట్యూబ్ కాలంలో అటువంటి క్లిప్పింగులు నెట్లో హడావుడి చేస్తూ ఇంకాస్త హాస్యాస్పదంగా మారిపోతున్నాయి.