Begin typing your search above and press return to search.
26/11పై మేజర్ దాడి..వర్మ ఇంకా మౌనంగానే!
By: Tupaki Desk | 16 Jun 2022 11:30 PM GMTఇటీవలే రిలీజ్ అయిన 'మేజర్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2008 ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితకథ ఆధారంగా యంగ్ మేకర్ శషి కిరణ్ తిక్క తెరకెక్కించగా..సందీప్ పాత్రలో అడవి శేషు ఒదిగిపోయారు. రీల్ మేజర్ రియల్ మేజర్ ని తలపించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. దేశభక్తిని చాటి చెప్పిన తొలి తెలుగు చిత్రంగా 'మేజర్' నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వర్మ తెరకెక్కించిన ముంబై తాజ్ 'ఎటాక్ 26/11' తర్వాత 'మేజర్' చిత్రానికి స్టాడింగ్ ఓవియేషన్ లో అమరులకు ఘనమైన నివాళి దక్కింది. ఈ రెండు చిత్రాలు కూడా 2008 ఉగ్రదాడుల్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనవే. వర్మ చిత్రంలో ఒకలా...మేజర్ చిత్రంలో అమరుడి జీవిత కథని తీసుకుని దానికి అద్భుతమైన దృశ్య రూపం ఇవ్వడం జరిగింది.
అయితే వర్మ తీసిన 26/11పై మేజర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. వర్మ ముంబై ఎటాక్స్ ని స్వార్ధం కోసం వాడు కున్నారని..తన ప్రయత్నం నిజాయితీగా అనిపించలేదని శేషు అభిప్రాయపడ్డారు. అందులో విలన్లు కూడా కమర్శియల్ గా క్లోజప్ లో చూపించారు. నాకది నచ్చలేదు. నానా పటేకర్ నిజాయితీ గల స్పీచ్ నచ్చింది. మొత్తంగా సినిమా లో కమర్శియల్ యాంగిల్ కనిపించిందని'' అని అని ఓ ప్రముఖ దర్శక-నిర్మాత ఇంటర్వ్యూ సాక్షిగా అన్నారు.
మరి ఇవి ఇంకా వర్మ చెవిన పడినట్లు లేదు. లేదంటే సీన్ లోకి వచ్చేసేవారు. ఇక వర్మ తెరకెక్కించిన ముంబై ఎటాక్ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించింది. వర్మ ని వరుసగా ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతోన్న తరుణంలో చేసిన చిత్రమది. ఇక వర్మ పనైపోయిందని విమర్శించి..దూషించిన సందర్భం అది. సరిగ్గా అదే సమయంలో తాజ్ ఎటాక్ పై సినిమా చేసి దేశం మెచ్చేలా ...తనవైపు తిరిగి చూసేలా చేసారు.
సిసలైన వర్మ అంటే అలా ఉంటాడని మరోసారి రుజువు చేసాడు. ఎంతమంది దర్శకులున్నా వర్మ ప్రత్యేకత అదని చాటి చెప్పారు. అప్పట్లో 'శివ'..ఆ తర్వాత '26 /11'అని మరోసారి గుర్తు చేసారు. మరి వర్మకి అంతటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సినిమాని శేషు అంత సులభంగా విమర్శించాడంటే? వర్మ మౌనంగా ఎందుకుంటారు? విషయం చెవిన పడిరోజున రచ్చకెక్కారు.
ఇటీవలే వర్మ నిర్మాత నట్టి కుమార్ తో పొసగిన వివాదాన్ని పరిష్కరించుకున్న సంగతి తెలిసిందే. నువ్వెంతంటే? నువ్వెంత అని దూషించుకున్న ఇరువురి మధ్య సయోధ్య కుదరడంతో బ్రోబ్రో అంటూ మళ్లీ మీడియా ముందుకొచ్చారు. జరిగిన గొడవంతా ప్రాంక్ తరహాలో గాలి తీసేసారు. ఇంకా వర్మ ఆ మోడ్ లోనే ఉన్నారు. వర్మపైనే ఎటాక్ చేసారంటే? మ్యాటర్ అంత వీజీగా ఉండదు గా.