Begin typing your search above and press return to search.

హిట్ చిత్రాల‌న్నింటినీ రీ-రిలీజ్ చేసే ప్లాన్ లో వ‌ర్మ‌!

By:  Tupaki Desk   |   12 Oct 2022 12:55 PM GMT
హిట్ చిత్రాల‌న్నింటినీ రీ-రిలీజ్ చేసే ప్లాన్ లో వ‌ర్మ‌!
X
హిట్ చిత్రాల‌ రీ-రిలీజ్ లు ఇప్పుడు ట్రెండ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. రీరిలీజ్ లు సైతం బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపిస్త‌న్నాయి. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి...కింగ్ నాగార్జున‌.. న‌ట‌సింహ బాల‌కృష్ణ‌...ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రాలు రీ-రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ సైతం త‌న హిట్ చిత్రాల్ని రీ -రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇప్ప‌టికే 12 ఏళ్ల క్రితం నాటి `అడ‌వి` చిత్రాన్ని ఈనెల 14న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా ఆ సినిమాకి ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ రీరిలీజ్ ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. జనరేషన్ మారుతున్న ప్రతీసారి గతంలో వచ్చిన కొన్ని చక్కటి సినిమాలను చూడాలని మారుతున్నయూత్ కోరుకుంటుంటారు.

అప్పట్లో ఎలా తీశారు? ఎందుకు తీశారు? టెక్నికల్ గా అప్పుడు వచ్చిన అప్ డేట్స్ వంటివి చూడాలని మారుతున్న జనరేషన్ ఆశిస్తారు. `అడవి` సినిమానే తీసుకుంటే ఫారెస్ట్ ఫోటోగ్రఫీ.. సాంగ్స్.. సౌండ్ వంటివన్నీ సినిమాకు హైలైట్ గా ఉంటాయి. వాటిని మ‌ళ్లీ థియేట‌ర్లో చూడాల‌ని యువ‌త కోరుకుంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నాం.

అలాగే మిగ‌తా హిట్ చిత్రాల్ని కూడా రిలీజ్ చేసేలా నిర్మాత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నా. రైట్స్ ఉన్న ఆయా సినిమాల నిర్మాతలతో సంప్రదించి కొన్ని సినిమాలను రీ- రిలీజ్ చేస్తాం` అన్నారు. అలాగే ఇప్పుడు రీ-రిలీజ్ అవుతోన్న అడ‌వి సినిమాని అప్ప‌ట్లో న‌ట్టి కుమార్ రిలీజ్ చేసారు. అలాగే నట్టి కుమార్ తో కలసి మ‌రిన్ని సినిమాలను చేస్తాన‌ని వ‌ర్మ వాగ్ధానం చేసారు.

ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌లేద‌ని వెల్ల‌డించారు. ఈ చిత్రాన్ని దాదాపు 100 థియేట‌ర్ల‌ల‌లో రిలీజ్ చేస్తున్నారు. న‌ట్టికుమార్ కుమార్ మాట్లాడు.. ఇటీవలే` 3` సినిమాను రీ రిలీజ్ చేస్తే.. మేము ఊహించినదానికంటే గొప్ప స్పందన రావడం మాకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఈ ప్రేరణతో ఈ నెల 15న ప్రభాస్ నటించిన `రెబల్` సినిమాను.. ఈ నెల 22న `వర్షం` సినిమాను మా సంస్థ తరపున నేను రీ రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.