Begin typing your search above and press return to search.
వర్మ 'కాంతార' కామెంట్స్... నిజమే కదా భయ్యా!
By: Tupaki Desk | 20 Oct 2022 6:37 AM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా మొహమాటం లేకుండా మాట్లాడేస్తూ ఉంటాడు.. తాను ఏది అనుకుంటే అదే బయటకు అనేస్తాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనే విషయాన్ని అసలు వర్మ పట్టించుకోడు. తనకు నచ్చిన సినిమాను ఆకాశానికి ఎత్తడం ఆయనకే చెల్లింది. నచ్చని సినిమాలపై తీవ్రమైన విమర్శలు కూడా ఆయన చేస్తూ ఉంటాడు.
తాజాగా కన్నడ సినిమా కాంతార పై వరుసగా ట్వీట్స్ చేసి వర్మ అందరి దృష్టిని ఆకర్షించాడు. వర్మ కాంతార సినిమాను ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎత్తడంతో పాటు హీరో రిషబ్ షెట్టి పై కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతే కాకుండా అన్ని ఇతర సినిమా ఇండస్ట్రీల వారు కూడా రిషబ్ షెట్టికి మంచి సినిమా పాఠాలు నేర్పించినందుకు.. నటన నేర్పించినందుకు గాను ట్యూషన్ ఫీజు ఇవ్వాలన్నాడు.
ఇంకా వర్మ ట్విట్టర్ లో... భారీ చిత్రాలను ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలను నిర్మించే వారికి ఈ సినిమా ఒక పీడకల. ఈ సినిమా వారిని అర్థ రాత్రి మేల్కొని ఆలోచించే విధంగా చేస్తుంది. డెవిల్ గా పిలిచే రిషబ్ శెట్టికి థాంక్స్. కాంతార సినిమా రాబోయే తరాల వారికి ఒక గుణపాఠం మాదిరిగా నిలవాలని.. నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేయడం జరిగింది.
చాలా మంది స్టార్స్ రిషబ్ శెట్టి ఇంటర్వ్యూ ను చూడాల్సిన అవసరం ఉంది. అలా సింప్లిసిటీ గా ఉండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తాయి అన్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. వందల కోట్ల సినిమాలు నిర్మించే బదులు ఇలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకు రావడం వల్ల వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతాయని వర్మ పేర్కొన్నాడు.
వర్మ మాటల్లో నిజం ఉంది.. నిజంగానే రిషబ్ శెట్టిని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.. అన్ని ఇండస్ట్రీ వారు కూడా కంటెంట్ విషయంలో కాంతార ను చూసి నేర్చుకోవాలి అంటూ వర్మ మాటలను చాలా మంది సమర్ధిస్తూ నిజమే కదా అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.