Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ని టీజ్ చేస్తున్న వర్మ
By: Tupaki Desk | 16 May 2022 11:04 AM GMTవివాదం వున్నా లేకున్నా ఎక్కడ వివాదం వుంటుందో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 'కేజీఎఫ్ 2' ఎప్పుడైతే దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే వర్మ బాలీవుడ్ ని ఫుట్ బాల్ ఆడుకోవడం మొదలు పెట్టారు. తనని గతంలో టార్గెట్ చేసిన బాలీవుడ్ పై ఈవిధంగా రివేంజ్ తీర్చుకుంటూ బాలీవుడ్ వర్గాలకు తనదైన పంచ్ లతో నిద్ర లేకుండా చేస్తున్నారు.
పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 మూవీస్ బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రాలకు మించి వసూళ్లని రాబట్టడంతో వర్మ బాలీవుడ్ ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. వరుసగా బాలీవుడ్ పై ట్వీట్ లు చేస్తూ ఇక ఓటీటీ దారి చూసుకోవాల్సిందే అంటూ వారిని దారుణంగా అవమానిస్తున్నారు. బాలీవుడ్ పని అయిపోయింది. సౌత్ సినిమాలు భారీగా పుంచుకోవడం.. బాలీవుడ్ సినిమాలు దారుణంగా పడిపోవడం చూస్తుంటే బాలీవుడ్ సినిమాలు కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు మాత్రమే పరిమితం అనే సంకేతాల్నిస్తోందంటూ దారుణంగా సెటైర్ వేశారు.
ఇటీవల సుదీప్ - అజయ్ దేవగన్ ల భాషా యుద్దంపై స్పందించిన వర్మ మహేష్ 'బాలీవుడ్ నన్ను భరించలేదు' కామెంట్ పై కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే తాజాగా బాలీవుడ్ సిపిమా కలెక్షన్ లపై వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు మరో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు బాలీవుడ్ వర్గాల్లో దక్షిణాది అంటే తీవ్ర అసహనం నెలకొని వుంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ ని వర్మ టీజ్ చేస్తున్న తరీరుకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ అవాక్కవుతున్నారు.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై విరుచుకుపడుతున్న వర్మ తాజాగా ఆయా సినిమాల కలెక్షన్ లపై కామెంట్ చేయడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' కలెక్షన్ లను రణ్‌వీర్ సింగ్ నటించిన 'జయోష్ భాయ్ జోర్దార్'తో పోలుస్తూ వర్మ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలుగు సినిమాకు మొదటి వీకెండ్ లో రూ. 135 కోట్లు వస్తే.. హిందీ సినిమాకు 11.75 కోట్లు మాత్రమే వచ్చాయిని సెటైరికల్ గా పంచ్ వేశారు. వర్మ బాలీవుడ్ హీరో సినిమాపై వేసిన పంచ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
పుష్ప తరువాత ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లుగా మారిన దగ్గరి నుంచి బాలీవుడ్ ని వర్మ తనదైన పంచ్ లతో సెటైర్లు వేస్తూ టీజ్ చేస్తూనే వున్నాడు.
తాజాగా వర్మ.. రణ్‌వీర్ సింగ్ సినిమా 'జయోష్ భాయ్ జోర్దార్' పై చేసిన వ్యాఖ్యలపై రణ్ వీర్ స్పందిస్తారా? .. లేక మరెవరైనా రంగంలోకి దిగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.