Begin typing your search above and press return to search.

అరియానా తీరుకు అప్పుడే ఆశ్చర్యపోయా: వర్మ

By:  Tupaki Desk   |   20 Dec 2020 12:30 PM GMT
అరియానా తీరుకు అప్పుడే ఆశ్చర్యపోయా: వర్మ
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ పుణ్యమా అని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అందులో అంతా కొత్త వారే నటించడంతో వారికి మంచి ఫేమ్‌ వస్తుంది. వర్మ వల్ల ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న వారు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎంతో మంది టెక్నీషియన్స్ ను నటీనటులను ఇండస్ట్రీకి అందించిన వర్మ అనూహ్యంగా బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అరియానాకు పాపులారిటీ రావడంలో ఇండైరెక్ట్ గా తనకు తెలియకుండానే సాయపడ్డాడు.

వర్మను ఇంటర్వ్యూ చేసిన అరియానా ఆ సమయంలో అడిగిన ప్రశ్నలు అందరిని ఆకర్షించాయి. వాటికి వర్మ చెప్పిన సమాధానాలు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. ఆ కారణంగా అరియానాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సమయంలోనే అరియానా మరింతగా మీడియాలో జోరు చూపించింది. తనకు వచ్చిన వర్మ ఇమేజ్‌ ను ఉపయోగించుకోవడంలో అరియానా నూటికి నూరు పాళ్లు సక్సెస్‌ అయ్యింది. అందుకే ఆమెకు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ఆమెకు చాన్స్ దక్కింది.

బిగ్‌ బాస్‌ లో ఉన్న అరియానా గురించి రెండు మూడు సందర్బాల్లో వర్మ మాట్లాడాడు. తాజాగా అరియానా గురించి వర్మ మాట్లాడుతూ అరియానా సిగ్గు పడకుండా ప్రశ్నలు అడిగిన తీరు నాకు నచ్చింది. బోల్డ్‌ లేడీ అని అప్పుడే అనిపించింది. ఆ అమ్మాయి తీరుకు నాకు ఆశ్చర్యం వేసిందని వర్మ అన్నాడు. బిగ్ బాస్ లో బోల్డ్‌ లేడీ అంటూ వెళ్లిన అరియానా నిజంగానే బోల్డ్‌ గా ఉంటూ ఫైనల్‌ 5 వరకు చేరింది. నెం.4 గా ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు.