Begin typing your search above and press return to search.

'స్టాండ్ అప్ రాహుల్' లో డిఫరెంట్ లుక్ లో బొల్ల‌మ్మ..!

By:  Tupaki Desk   |   23 Jun 2021 6:30 AM GMT
స్టాండ్ అప్ రాహుల్ లో డిఫరెంట్ లుక్ లో బొల్ల‌మ్మ..!
X
'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ వ‌ర్ష బొల్ల‌మ్మ.. 'జాను' రీమేక్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ''స్టాండ్ అప్ రాహుల్'' సినిమాతో పలకరించబోతోంది బొల్లమ్మ. 'కుర్చుంది చాలు' అనేది దీనికి ఉపశీర్షిక.

ఇప్పటికే విడుదలైన 'స్టాండ్ అప్ రాహుల్' సినిమాలోని రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ వర్షా బొల్లమ్మ పాత్రకు సంబంధించిన లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వర్ష పళ్లకు క్లిప్ పెట్టుకుని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది. పెద్ద కళ్ళద్దాలు పెట్టకొని ఉన్న బొల్లమ్మ.. కొత్త హెయిర్ స్టైల్ తో విభిన్నమైన కాస్ట్యూమ్స్ ధరించి ఉంది.

ఇందులో ఆమె శ్రేయా రావ్ అనే యువతి పాత్రలో నటిస్తోందని మేకర్స్ వెల్లడించారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే వర్షా బొల్లమ్మ కెరీర్ లో ఫస్ట్ టైం ఇలాంటి వైవిధ్యమైన రోల్ లో కనిపించబోతున్నట్లు అర్థం అవుతోంది. 'స్టాండ్ అప్ రాహుల్' చిత్రానికి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు ముద్దా సమర్పణలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది.

ఈ కామెడీ ఎంటర్టైనర్ కి నంద్‌ కుమార్ అబ్బినేని - భ‌ర‌త్ మాగులూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'స్టాండ్ అప్ రాహుల్' సినిమా రాజ్ తరుణ్ - వర్ష బొల్లమ్మ లకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.